పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
గొల్లపల్లి పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులుగా అంకం భూమయ్య
గొల్లపెల్లి ఆగస్టు 17 (ప్రజా మంటలు):
గొల్లపల్లి పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు ఆదివారం సంఘ భవనంలో నిర్వహించారు. అధ్యక్షులుగా అంకం భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా చౌటపల్లి తిరుపతి (బట్టల), ఉపాధ్యక్షులుగా గాజెంగి హనుమాన్లు, హోరహోరిగా సాగిన ఎన్నికలలో విజయం సాధించారు. కోశాధికారిగా అంకం లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శిగా చౌటపల్లి రఘునందo ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన సభ్యులచే ఎన్నికల నిర్వహణ కమిటి సభ్యులు ఎనగందుల సుదర్శన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను పద్మశాలి మండల అధ్యక్షులు కస్తూరి సత్యం ,చందోలి మాజీ సర్పంచ్ అలిశెట్టి రవీందర్, రాపల్లి మాజీ ఎంపీటీసీ కొక్కుల భూమయ్య లు శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సత్కరించారు . సంఘ అభివృద్ధికి పాటుపడుతూ సంఘ సభ్యులకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు చౌటపల్లి తిరుపతి, మాజీ కోశాధికారి అంకం లింబాద్రి,గూడూరి రాజన్న,అంకం రవి, ఎనగందుల సాయికృష్ణ, అంకం అరుణ్ కుమార్,అనుమల్ల జలందర్, ఎనగందుల శంకర్, జక్కుల శ్రీనివాస్,అంకం గణేష్,అంకం సతీష్, ఎల్లే పవన్,ధర్మపురి మల్లేశం సంఘ సభ్యులు యువకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ముగిసిన రాజ్ ప్రకాష్ పాల్ పశ్చాత్తాప సమావేశాలు

మెటుపల్లిలో ఇస్కాన్ శ్రీ కృష్ణ జన్మాష్టమి మహోత్సవం

మళ్ళీ ఆసుపత్రిలో చేరిన నవీన్ పట్నాయక్!
.jpeg)
మూర్తీభవించిన RSS కార్యకర్తను ఎంపిక చేసిన బిజేపి

NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్

అధికారులపై కుక్కల దాడి ఘటనపై ఎస్హెచ్ఆర్సీ కి అడ్వకేట్ ఫిర్యాదు

ఎలక్షన్స్ వరకే పాలిటిక్స్..తర్వాత అభివృద్దే లక్ష్యంగా ముందుకు - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

కోల్‌కతాలో బెంగాల్ ఫైల్స్ సినిమా ట్రైలర్ విడుదల నిలుపుదల
.jpeg)
ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం

ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం -వచ్చే నెలలో ప్రారంభం

ఓటరు జాబితా శుద్దీకరణ బాధ్యత రాజకీయ పార్టీలదే - ఎన్నికల కమీషన్
