అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ
జగిత్యాల జులై 25 (ప్రజా మంటలు)
శాంతి భద్రతల పరిరక్షణకు గస్తీని మరింత ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బ్లూ కోల్డ్స్, పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహిస్తూ అదనంగా నైట్ బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో జిల్లా ఎస్పీ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో పెట్రోలింగ్ వ్యవస్థను స్వయంగా పరిశీలించి అదికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... అర్ధరాత్రి సమయంలో సమర్థవంతమైన పెట్రోలింగ్ ద్వారా ప్రజలో భద్రత భావం ను పెంపొందించడం జిల్లా పోలీసుల లక్ష్యం అని రాత్రి సమయంలో నిఘా మరింత పటిష్టం చేస్తూ సమయానుకూల చర్యలు తీసుకోవడం ద్వారా చాలా వరకు నేరాలను నియంత్రించవచ్చు అన్నారు.
అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను తనిఖీ చేయడం తో పాటు వారి వేలిముద్రలను సేకరించి, గత నేర చరిత్ర గల నిందితులతో సరిపోల్చడం జరుగుతోంది అన్నారు. అలాగే, అనుమానాస్పద మరియు అక్రమ కార్యకలాపాలను అడ్డుకునే ఉద్దేశంతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాల నివారణ గురించి పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచడం జరిగిందని దీని ద్వారా జిల్లాలోని ప్రజలు ప్రశాంతం ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో అమరులైన వారికి ఘన నివాళులు

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం,

హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు

మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ - రెండు వందల కార్లు , బస్సులతో హైదరాబాద్ నుంచి వేములవాడకు

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.
