రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూడండి - శేర్ నర్సారెడ్డి
హైదరాబాద్ ఆగస్ట్ 18 (ప్రజా మంటలు):
రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా తక్షణమే తగు చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు హైదరాబాద్ లోని సచివాలయంలో సోమవారంనాడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆయన వినతి పత్రం సమర్పించారు.
రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఏర్పడడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారనీ, వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా సరిపడా యూరియాను కేటాయించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి ఎరువుల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందనీ, వ్యవసాయ పంటలకు సరైన సమయంలో యూరియా వేయకపోతే పంటల దిగుబడి తగ్గి అరుగాలం కష్టపడి పండించిన పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల వ్యవసాయ పంటల అవసరాలను దృష్టిలో ఉంచుకుని యూరియా కొరత లేకుండా తక్షణమే తగు చర్యలు తీసుకోని రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమర్పించిన వినతి పత్రంలో తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి విజ్ఞప్తి చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
1.jpeg)
ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు
1.jpeg)
రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

గాంధీ ఆసుపత్రి కి స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
.jpg)