అధికారులపై కుక్కల దాడి ఘటనపై ఎస్హెచ్ఆర్సీ కి అడ్వకేట్ ఫిర్యాదు
విచారణకు స్వీకరించిన మానవ హక్కుల కమిషన్
*ప్రతివాదిగా రాష్ర్ట ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని చేర్చిన కమిషన్
సికింద్రాబాద్, ఆగస్ట్ 17 (ప్రజామంటలు) :
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో అధికారులపై వీధి కుక్కలు కరిచి గాయపరిచిన ఘటనపై సిటీకి చెందిన అడ్వకేట్ రామారావు ఇమ్మనేని చేసిన ఫిర్యాదును తెలంగాణ రాష్ర్ట మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది.
ఈ ఘటనలో ప్రధాన ప్రతివాదిగా రాష్ర్ట ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని పేర్కొంటూ నెంబర్ 858/ఐఎన్/2025 ద్వారా విచారణకు నిర్ణయించింది. తుంగతుర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఇండిపెండెంట్స్ డే సెలబ్రేషన్స్ కు సంబందించి ఏర్పాట్లలో ఉన్న ఆరుగురిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయని రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ వైపు వీధికుక్కల నియంత్రణపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం మాత్రం కుక్కల నియంత్రణలో నిర్లక్ష్యంగా ఉందన్నారు.
ఈ విషయమై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పై చర్యలు తీసుకోవాలని, వీధికుక్కల దాడిలో గాయపడ్డ ఆరుగురికి వైద్య సహాయం, తగిన పరిహారం అందించే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అడ్వకేట్ రామారావు తన ఫిర్యాదులో తెలంగాణ రాష్ర్ట మానవ హక్కుల కమిషన్ ను కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ముగిసిన రాజ్ ప్రకాష్ పాల్ పశ్చాత్తాప సమావేశాలు

మెటుపల్లిలో ఇస్కాన్ శ్రీ కృష్ణ జన్మాష్టమి మహోత్సవం

మళ్ళీ ఆసుపత్రిలో చేరిన నవీన్ పట్నాయక్!
.jpeg)
మూర్తీభవించిన RSS కార్యకర్తను ఎంపిక చేసిన బిజేపి

NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్

అధికారులపై కుక్కల దాడి ఘటనపై ఎస్హెచ్ఆర్సీ కి అడ్వకేట్ ఫిర్యాదు

ఎలక్షన్స్ వరకే పాలిటిక్స్..తర్వాత అభివృద్దే లక్ష్యంగా ముందుకు - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

కోల్‌కతాలో బెంగాల్ ఫైల్స్ సినిమా ట్రైలర్ విడుదల నిలుపుదల
.jpeg)
ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం

ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం -వచ్చే నెలలో ప్రారంభం

ఓటరు జాబితా శుద్దీకరణ బాధ్యత రాజకీయ పార్టీలదే - ఎన్నికల కమీషన్
