బహుజన ఎదుగుదలకు చదువొక్కటే మార్గం - సర్వాయి పాపాన్ని జయంతి వేడుకలలో రేవంత్ రెడ్డి 

On
బహుజన ఎదుగుదలకు చదువొక్కటే మార్గం - సర్వాయి పాపాన్ని జయంతి వేడుకలలో రేవంత్ రెడ్డి 

బీసీల రిజర్వేషన్లకు బీజేపీ, BRS లే అడ్డంకి 
మతం పేర రాజకీయం

హైదరాబాద్ ఆగస్ట్ 18:

బహుజనులు సమాజంలో ఎదగాలన్నా, నిలదొక్కుకోవాలన్నా చదువు ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ఉద్గాటించారు. బహుజనులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పైన తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్  విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  శంకుస్థాపన చేశారు. 

హైదరాబాద్ రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి 375వ జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రరెడ్డి పాల్గొన్నారు.

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నగర మేయర్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

  హైదరాబాద్ రవీంద్రభారతిలో శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్  375 వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఆ మహనీయుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు మంత్రులు, సలహాదారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి  మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలని, అందుకే గుండెకాయ లాంటి సచివాలయం ఎదురుగా ట్యాంక్‌బండ్‌ పైన ఏర్పాటు చేస్తున్నాం. సర్దార్ పాపన్న గౌడ్ నిర్మించిన ఖిలాషాపూర్ కోటను చారిత్రక క్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నాం.

బీసీల రిజర్వేషన్లకు బీజేపీ, BRS లే అడ్డంకి

 వందేళ్లుగా ఎదురుచూస్తున్న బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చిన మాట ప్రకారం, ఏ రాష్ట్రంలో జరగని కుల గణనను తెలంగాణలో పూర్తి చేసి బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పించాం. నూటికి నూరు శాతం చిత్తశుద్ధితో పకడ్బందీగా జనాభాను లెక్కించి సమగ్ర సమాచారం సేకరించాం. ముస్లింల పేర బీజేపీ రిజర్వేషన్లు అడ్డుకుంటుంది.అలాగే బియారెస్ తొండి పెడుతుందని ముఖ్యమంత్రి అన్నారు.Screenshot_2025-08-18-20-57-24-42_6012fa4d4ddec268fc5c7112cbb265e7

తొండి వాదనలతో ప్రభుత్వం తీసిన లెక్కలను వక్రీకరిస్తే మళ్లీ రాబోవు వందేళ్ల వరకు బహుజనులకు న్యాయం జరగదు. క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని అత్యంత పకడ్బందీగా సమాచారాన్ని సేకరించి క్రోడీకరించాం.

 ఆ వివరాల ఆధారంగానే బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం, విద్య ఉద్యోగావకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రిమండలి తీర్మానించి శాసనసభలో సమగ్ర చర్చ చేసి ఆమోదించిన రెండు బిల్లులను గవర్నర్ గారికి పంపించాం. అలాగే స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీలులేకుండా గత ప్రభుత్వం చేసిన పంచాయతీ రాజ్ చట్టం అడ్డంకిగా మారడంతో ఆ గరిష్ట పరిమితిని తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశాం.

 ఆ మూడింటినీ గవర్నర్ రాష్ట్రపతికి పంపించారు. వాటిని ఆమోదించాల్సిన అవసరం ఉంది. గడిచిన అయిదు నెలలుగా పెండింగ్‌లో పెట్టారు. వాటిని ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి చేయడానికి యావత్ మంత్రిమండలి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా సంఘాల ప్రతినిధులందరం ఢిల్లీలో ఆందోళన చేశాం.

కుల గణన లెక్కల్లో ఎక్కడా ఒక్క తప్పు లేదు. ప్రతి 150 ఇండ్లకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున 95 వేల మంది ఎన్యుమరేటర్లు 60 రోజుల పాటు ఇంటింటికీ తిరిగి సమాచారాన్ని సేకరించారు. ఆ సమాచారాన్ని సంపూర్ణంగా కంప్యూటర్ లో క్రోడీకరించాం.

మతం పేర రాజకీయం

దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు చట్టంలోనే తావు లేదు. తెలంగాణ పంపించిన రెండు బిల్లులు, ఆర్డినన్స్‌లో అందుకు సంబంధించి ఒక ముక్కలేదు. వెనుకబాటు తనం ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాం.

సమస్యలన్నీ ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందుకు పోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో బహుజనులు చదువుకోవడం ద్వారానే తలరాత మార్చుకోగలరు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలంటే అందరూ చదువుకోవాలి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరిగి ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుంది.." అని ముఖ్యమంత్రి  ఉద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సలహాదారులు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్  పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నగర మేయర్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ సికింద్రాబాద్, ఆగస్టు 20 (ప్రజామంటలు): ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా జిహెచ్ఎంసి ఎంటమాలజీ సిబ్బంది బన్సీలాల్ పేట డివిజన్ బోయిగూడ ఐడిహెచ్ కాలనీ లో దోమల అవగాహన ర్యాలీ నిర్వహించారు.  దోమలతో కలుగు వ్యాధులు,  వాటి వ్యాప్తి, నివారణ పై స్థానికులకు అవగాహన కల్పించారు . ర్యాలీలో గాంధీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్  డాక్టర్...
Read More...
National  Filmi News  State News 

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత  వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు పబ్లిక్ పాలసీ ముసాయిదాను సమర్పించండి - కోర్ట్ ఆదేశాలు  సినిమాల్లో మహిళలకు సమానత్వ చట్టం పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత (intersectional) వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు లో న్యాయమూర్తులు మౌఖిక సూచన చేశారు వినోద పరిశ్రమలో మహిళల రక్షణ కోసం సమానత్వ చట్టాన్ని రూపొందించేటప్పుడు సంబంధితిత" అంశాలను కూడా...
Read More...
Local News  State News 

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి 

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళులు  దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారు - రేవంత్ రెడ్డి  హైదరాబాద్ ఆగస్ట్ 20 (ప్రజా మంటలు): పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని,18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి దేశ భవిష్యత్ ను నిర్ణయించే అవకాశం...
Read More...
Local News 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇందిరా భవన్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు జగిత్యాల ఆగస్ట్ 20 ( ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ లో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు...
Read More...
Filmi News  State News 

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్ ఎందరో నటులు సినీరంగం నుండి రాజకీయాల్లోకి - అదేబాటలు సుమన్ విజయవాడ ఆగస్టు 20: 2029 లో సుమన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పోటీ పోటీచేస్తానని ప్రకటించారు.ఇక తాజాగా సినీ హీరో సుమన్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో స్వతంత్ర సమరయోధులు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడిన సుమన్ తన...
Read More...
National  State News 

ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు

ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని స్వాగతించిన చిన్నారెడ్డి గారు హైదరాబాద్ ఆగస్ట్ 20 (ప్రజా మంటలు): భారత దేశ ఉప రాష్ట్రపతి ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి పేరును ప్రకటించడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.  ప్రస్తుతం దేశంలో...
Read More...
Local News  Spiritual  

రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు జగిత్యాల ఆగస్ట్ 19 (ప్రజా మంటలు)): శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవ ఉత్సవ ప్రచార రథాన్ని డీఎస్పీ దుర్శెట్టి రఘు చందర్ ప్రారంభించారు. అమ్మవారి ఉత్సవాలు తేదీ:20-08-2025 బుధవారం  నుండి 23-08-2025 శనివారం  వరకు జరుగురాయని ఆలయ కమిటీ ప్రకటించింది. డీఎస్పీ దుర్శెట్టి రఘు చందర్  అమ్మవారుకు ప్రత్యేక పూజలు...
Read More...
National  State News 

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం ముంబై ఆగస్టు 19: ముంబైలోని మోనోరైలులో చిక్కుకున్న ప్రయాణికులందరినీ సురక్షితంగా రక్షించారు. ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైలు సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితిలో, ఈ సాయంత్రం (ఆగస్టు 19) భారీ వర్షాల మధ్య నడుస్తున్న మోనోరైలు ముంబైలోని మైసూర్ కాలనీ స్టేషన్ సమీపంలో కదులుతుండగా అకస్మాత్తుగా మధ్యలో ఆగిపోయింది....
Read More...
State News 

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) : తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చింది.- వాంకిడి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కలుషిత ఆహరం తిని 22 రోజులు మృత్యువు తో పోరాడి గత ఏడాది నవంబర్ 25 న మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనలో-  సుమారు 60...
Read More...
Local News 

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి అంబేడ్కర్ ను రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్సే .. సికింద్రాబాద్,  ఆగస్టు 19 (ప్రజా మంటలు):  రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతుందని దాన్ని అంబేడ్కర్ వాదులు తిప్పికొట్టాలని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టి అంబేద్కర్ గారిని  రాజ్యాంగాన్ని అవమానించిన కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన ప్రస్తుతం చేస్తున్న...
Read More...
Local News  State News 

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) : ప్రభుత్వ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం గాంధీ ఆసుపత్రిలో రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ నేతలు వినతి పత్రం సమర్పించారు. కెరీర్ అడ్వాన్స్మెంట్, టైం బౌండ్ ప్రమోషన్స్ అమలు చేయాలని, వైద్యులకు ట్రాన్స్...
Read More...

గాంధీ ఆసుపత్రి కి  స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

గాంధీ ఆసుపత్రి కి  స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఓపీ విభాగాల్లో పర్యటించిన మంత్రి    వైద్యాధికారులతో కలసి రివ్యూ మీటింగ్ సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) : రాష్ర్టంలోనే పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన గాంధీ ఆసుపత్రిలో ఎప్పటి కప్పుడు సమస్యల పరిష్కారానికి, అడ్మినిస్ర్టేషన్ లో లోపాలు లేకుండా ఓ స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలనే ఆలోచన ఉన్నట్లు రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర...
Read More...