డాక్టర్ సాగంటి మంజులకు "పద్మ చక్ర అవార్డు"
వరంగల్ ఆగస్టు 18 (ప్రజా మంటలు):
హనుమకొండ గోపాలపురానికి చెందిన లెక్చరర్, సామాజిక వేత్త, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు, పెయింటింగ్ ఆర్టీస్ట్ ఐన డాక్టర్ సాగంటి మంజులకు "పద్మ చక్ర-2025 అవార్డు" ప్రధానం చేశారు.
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, జి సి ఎస్ వల్లూరి ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ తెలుగు హాస్య నటులు మాజీ మంత్రి బాబు మోహన్ గారి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక "పద్మ చక్ర-2025 అవార్డు" ని హైదరాబాద్ రవీంద్ర భారతి లో ఆదివారం సాయంత్రం అందించారు.
79 వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా సంగీత, సాహిత్య, సామాజిక, విద్య, చిత్ర కళా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మంజులకు ఈ అవార్డు ని ఇవ్వడం సంస్థ కు గర్వకారణం అని, తన వల్ల చాలా మంది చిన్నారులు చిత్ర కళలో రానిస్తున్నారని, తెలుగు సాహిత్యం లో తనదైన శైలి లో కవితలు రాసి చైతన్య పరుస్తూ, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేస్తూ, ఉపాధ్యాయ విద్య కళాశాలలో ఎందరో ఉపాధ్యాయులను తయారు చేస్తున్న మంజులకు అవార్డు ఇవ్వడం సంతోషమని ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస రాజు అభినందించారు.
మంజుల మాట్లాడుతూ ఈ అవార్డు రావడం పట్ల సంతోషిస్తూ, సమాజం పట్ల, కళల పట్ల నా బాధ్యత మరింత పెరిగిందని, మరెన్నో సేవా కార్యక్రమాలు చేసే దిశగా ప్రోత్సాహిస్తున్న సంస్థ బాద్యులకు, బాబు మోహన్ కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
1.jpeg)
ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు
1.jpeg)
రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

గాంధీ ఆసుపత్రి కి స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
.jpg)