ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం
వెంకయ్య నాయుడు, వసుంధర రాజే, రాజనాథ్ సింగ్ ల పేర్లు పరిశీలన
న్యూ ఢిల్లీ ఆగస్ట్ 17:
న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిపై చర్చలు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ నెల 6న, అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) నాయకులు ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ అభ్యర్థిని ఖరారు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాకు అధికారం ఇస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు.
బీహార్,తరువాత vache పశ్చిమ బెంగాల్ ఎన్నికల దృష్ట్యా,musli అభ్యర్థి పేరు పరిశీలించాలని మోడీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ RSS దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇటీవల ప్రధానిని కలవడంతో, ఆయన పేరుకూడా వినపడుతుంది.వసుంధర రాజే, రాజనాథ్ సింగ్ ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇవేవీ కాకుండా, RSS సమ్మతి ఉన్న ఎవరినైనా ఎంపిక చేయవచ్చు. కాని ,ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించే వరకు వేచి చూసి, ఆతర్వాత మోదీ తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేకపోలేదు.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు గురువారం వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. వచ్చే నెల 9న ఎన్నిక జరుగుతుంది. జగదీప్ ధంఖర్ రాజీనామా కారణంగా ఎన్నిక తప్పనిసరి అయింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ముగిసిన రాజ్ ప్రకాష్ పాల్ పశ్చాత్తాప సమావేశాలు

మెటుపల్లిలో ఇస్కాన్ శ్రీ కృష్ణ జన్మాష్టమి మహోత్సవం

మళ్ళీ ఆసుపత్రిలో చేరిన నవీన్ పట్నాయక్!
.jpeg)
మూర్తీభవించిన RSS కార్యకర్తను ఎంపిక చేసిన బిజేపి

NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్

అధికారులపై కుక్కల దాడి ఘటనపై ఎస్హెచ్ఆర్సీ కి అడ్వకేట్ ఫిర్యాదు

ఎలక్షన్స్ వరకే పాలిటిక్స్..తర్వాత అభివృద్దే లక్ష్యంగా ముందుకు - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

కోల్‌కతాలో బెంగాల్ ఫైల్స్ సినిమా ట్రైలర్ విడుదల నిలుపుదల
.jpeg)
ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం

ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం -వచ్చే నెలలో ప్రారంభం

ఓటరు జాబితా శుద్దీకరణ బాధ్యత రాజకీయ పార్టీలదే - ఎన్నికల కమీషన్
