మెటుపల్లిలో ఇస్కాన్ శ్రీ కృష్ణ జన్మాష్టమి మహోత్సవం
శ్రీ రాధా గోవర్ధనధారి ఆలయం లో గోకులాష్టమి కార్యక్రమాలు
మెట్ పల్లి ఆగస్టు 17 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మెట్ పల్లి -కోరుట్ల మధ్యలో హరే కృష్ణ రోడ్డు, పెద్దపూర్ క్యాంప్ గురుకుల స్కూల్ దగ్గర, చౌలమద్ది శివారులో గల ISKCON శ్రీ శ్రీ రాధా గోవర్ధన ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి మహోత్సవం అద్భుతంగా, అంగరంగ వైభవంగా జరిగింది.వర్షాన్ని కుడా లెక్కచేయకుండా ఉత్తర తెలంగాణా లోని చాలా ప్రాంతాల నుండి చుట్టుప్రక్కల మండల మరియు గ్రామాల నుండి వేలాదిగా భక్తులు పోటేత్తారు.
భగవంతుడి దివ్యమైన దర్శనం తో, హరినామ సంకీర్తనలతో మందిరం, మందిర పరిసరాల లో గొప్ప ఆధ్యాత్మిక భావనలో భక్తులు పరవశించిపోయారు.భక్తులు మందిరం అంతటా లక్ష పుష్పాలతో అలకరించారు.భగవంతుడి గర్భగుడి లో అనేక రకాల పుష్పా లతో, ఆభరణాలతో శ్రీ శ్రీ రాధా గోవర్ధనధారి ని అద్భుతంగా అలంకరణ చేశారు, కనివిని ఎరగని విధంగా అద్భుతమైన దర్శనం తో, మరియు హరినామ సంకీర్తన లతో భక్తులు అందరూ తన్మయత్వం తో ఈ భౌతిక మాయ లోకాన్ని మరచి ఆధ్యాత్మిక జగత్తు యొక్క దివ్యమైన ఆనంద భావాన్ని పొందారు.
ఇస్కాన్ మెట్ పల్లి నిర్వాహకులు శ్రీమాన్ నరహరి ప్రభుజీ ద్వారా ప్రవచనం జరిగింది.. శ్రీ కృష్ణ జన్మ వృత్తాంతం, భగవంతుడి ప్రకటన ఉద్దేశం గురించి వివరించారు.
సాయంత్రం 6 గం ల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, సంకీర్తనలు, అభిషేకం, మరియు... అష్టమి తిధి ప్రథమ దివ్య దర్శనం, ప్రథమ దివ్య హారతి అర్థరాత్రి 12గం ల నుండి జరిగింది.
భక్తులు భగవంతుడి ప్రత్యేక దివ్య దర్శనం, సంకీర్తన లతో నృత్యం చేస్తూ గొప్ప ఆనందం పొందారు.అనంతరం భక్తులకు దివ్య ప్రసాద వితరణ జరిగింది.
ఈ రోజు ఇస్కాన్ ఆలయం లో ISKCON ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాదుల వారి ఆవిర్భావ మహోత్సవం మరియు శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా నందోత్సవము కార్యక్రమం జరుగును.
More News...
<%- node_title %>
<%- node_title %>
ముగిసిన రాజ్ ప్రకాష్ పాల్ పశ్చాత్తాప సమావేశాలు

మెటుపల్లిలో ఇస్కాన్ శ్రీ కృష్ణ జన్మాష్టమి మహోత్సవం

మళ్ళీ ఆసుపత్రిలో చేరిన నవీన్ పట్నాయక్!
.jpeg)
మూర్తీభవించిన RSS కార్యకర్తను ఎంపిక చేసిన బిజేపి

NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్

అధికారులపై కుక్కల దాడి ఘటనపై ఎస్హెచ్ఆర్సీ కి అడ్వకేట్ ఫిర్యాదు

ఎలక్షన్స్ వరకే పాలిటిక్స్..తర్వాత అభివృద్దే లక్ష్యంగా ముందుకు - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

కోల్‌కతాలో బెంగాల్ ఫైల్స్ సినిమా ట్రైలర్ విడుదల నిలుపుదల
.jpeg)
ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం

ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం -వచ్చే నెలలో ప్రారంభం

ఓటరు జాబితా శుద్దీకరణ బాధ్యత రాజకీయ పార్టీలదే - ఎన్నికల కమీషన్
