ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు - లబ్దిదారులకు ఉచితంగా ఇసుక అందిస్తాం
గొల్లపల్లి జూన్ 28 (ప్రజా మంటలు)
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరిలక్ష్మణ్ కుమార్ అన్నారు.
బుగ్గారం మండల కేంద్రంలో శనివారం ఇందిరమ్మ ఇండ్లు మంజూరి పత్రాలను, కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ చెక్కుల అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పంపిణీ చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు లబ్ధిదారులు సత్వరమే నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. విడతల వారీగా ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు.ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుందని తెలిపారు.సిమెంట్, స్టీల్ ధరలు తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నదని వివరించారు.
జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ మాట్లాడుతూ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టాలని సూచించారు.బేస్మెంట్, ఇతర దశలు పూర్తి కాగానే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డ్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాలని, వారు ఆన్లైన్లో నిర్మాణ దశను తెలియజేసి ప్రభుత్వం నుండి బిల్లులు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలు 191 అర్హులైన లబ్ధిదారులకుఅందజేశారు.కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ 17 చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.మంత్రి పర్యటన సందర్బంగా జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ పర్యవేక్షణలో ధర్మపురి, మల్యాల సీఐలు రామ్ నరసింహ రెడ్డి, నీలం రవి, ఎస్సైలు శ్రీధర్ రెడ్డి, కుమార స్వామి, కిరణ్, కృష్ణసాగర్ రెడ్డి పోలీస్ సిబ్బందితో బందోబస్తూ చేపట్టారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవిన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, జిల్లా అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేముల సుభాష్, ముస్కు నిశాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మహేష్ బండారు మహేష్, కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
