అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్
పనుల పురోగతిని పరిశీలించిన ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం
ఇబ్రహీంపట్నం ఆగస్టు 12 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట్ 33/11కేవీ సబ్స్టేషన్ లో సామర్థ్యానికి మించి లోడు నమోదు అవుతున్న దృష్ట్యా రూ.85 లక్షలతో అదనపు 5 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ మంజూరి కావడం, మూడు రోజుల క్రితం సబ్స్టేషన్ కు పంపించారు.
దీని స్థాపనకు అవసరమయ్యే బే- విస్తరణ పనుల పురోగతిని జగిత్యాల జిల్లా ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనుల్లో వేగం పెంచాలని, 18 వ తేదీ లోగా అందుబాటులోకి తేవాలని గుత్తేదారు ను మందలించారు. ఖరీఫ్ పంటల కొరకు లోడు రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతుందని, వాటిని తట్టుకోవాలంటే రెండవ 5 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ వినియోగంలోకి తేవడం అత్యావశ్యకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మెటుపల్లి డీఈ మధుసూదన్, మల్లాపూర్ ఏడీఈ మనోహర్, కన్స్ట్రక్షన్ ఏడీఈ రాజబ్రహ్మచారి, ఏఈ రవి, సబ్ ఇంజినీర్ చవాన్ ఇందాల్, లైన్మన్ రాము, గుత్తేదారు లింగం పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు) అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం
.jpeg)
సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం
.jpeg)