ఎరువుల విక్రయాలను ఖచ్చితంగా నమోదు చేయాలి రైతులకు అవసరమైన సరిపడ ఎరువులు అందుబాటులో ఉన్నాయి జిల్లా కలెక్టర్.
కథలాపూర్ /మేడిపల్లి ఆగస్టు 12 (ప్రజా మంటలు)
యూరియా విక్రయాలను పరిశీలించారు రైతులకు పంట వెస్తీర్ణం ఆధారంగా యూరియాను.పంపిణీ చేయాలి జిల్లా కలెక్టర్.
కథలాపూర్ మండలం భూషణ్ రావుపేట్ మరియు సిరికొండ గ్రామంలో మరియు
మేడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
ఎరువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా ఆధార్ కార్డుతో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.
మంగళవారం రోజున కథలాపూర్ మండలం భూషణ్ రావు పేట్ సిరికొండ గ్రామాలలో మరియు మేడిపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యూరియా, ఇతర ఎరువుల స్టాక్ వివరాలను, ఎరువుల సరఫరాపై ప్రతీ రైతుకి ఎన్ని బస్తాలు సరఫరా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
అదే విధంగా రైతులకు సంబంధించిన భూమి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం రైతులు వేసిన పంటకు అవసరమైన ఎరువులు మాత్రమే సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. రికార్డులు పరిశీలించి స్టాక్ ఎంత వచ్చింది, ఎంత సరఫరా చేసాం అన్నది తప్పనిసరి రికార్డ్ చేసుకోగలరని అధికారులను కలెక్టర్ ఆదేశించించారు.
రైతులకు ఎవరికైనా ఎక్కువ మొత్తంలో ఎరువులు పంపిణీ చేసినట్లయితే అట్టి సొసైటీ సిబ్బందిపై, వ్యవసాయ శాఖ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జి వాకర్ రెడ్డి, తహసిల్దార్ లు ఎంపీడీవోలు సంబంధిత అధికారులు, మరియు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు) అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం
.jpeg)
సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం
.jpeg)