వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

On
వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్


జగిత్యాల మే 27 (ప్రజా మంటలు)

 

కీటక జనితవ్యాధులపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం
గ్రామ మరియు పట్టణంలో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి  సీజనల్ వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్, ఆదేశించారు.

స్థానిక ఐడిఓసి సమావేశ మందిరంలో  జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్  అధ్యక్షతన కీటక జనిత మరియు సీజనల్ వ్యాధులపై,  వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
గత సంవత్సరం , సమన్వయంతో,సమర్థవంతంగా పనిచేసి డెంగ్యూ ఇతర సీజనల్ వ్యాధులను ఎదుర్కొనడంలో సఫలీకృతమయ్యామని తెలిపారు. 

ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే నిర్వహించడంతో పాటగా ప్రతిరోజు డ్రై డే పాటించాలని, కేవలం జ్వరాలనే కాకుండా ఇంటి పరిసరాలలో నీటిని నిలువలు  ఏమైనా ఉన్నచో, వెంటనే తొలగించాలనీ ప్రజలను అవగాహన పరచాలని తెలిపారు .  వారానికి ఒకసారి సర్వే ఫలితాలను క్రోడీకరించి, తీసుకోవలసిన చర్యల గురించి  నివేదికలు తయారు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాలు, వరదల వల్ల ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయే అవకాశమున్న  ప్రాంతాలను గుర్తించి, చేపట్టాల్సిన చర్యలు, ఈ .డి. డి. సమీపంలో ఉన్న గర్భిణులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు చేర్చి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 
గ్రామ సెక్రెటరీలు మున్సిపల్ కమిషనర్ ఫాగింగ్ మిషన్స్  సిద్ధంగా ఉంచుకోవాలని, ఏమైన రిపేర్ ఉంటే వెంటనే చేయించాలని ఆదేశించారు.

వాటర్ లీకేజెస్ గుర్తించడం, వాటిని సరిచేయడం, వరదల సమయంలో ఏవైనా ప్రాంతాలు ముంపు గురైనట్టేది వారిని తరలించడానికి అనుకూలమైన సురక్షిత ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని,   హైరిస్కు ప్రాంతాలను గుర్తించి, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు.  ఇప్పటినుండి ప్రతి సమావేశంలో అధికారులందరూ సీజనల్ వ్యాధులు, డెంగు నివారణ చర్ల గురించి మాట్లాడుచూ, ప్రజలలో అవగాహన కల్పించాలని తెలిపారు.  హాస్టల్స్ మరియు పాఠశాలల్లో పరిసరాల పరిశుభ్రత గురించి ప్రత్యేక శ్రద్ధ చూపాలని  ఆదేశించారు.

జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 296 ఫాగింగ్ మిషన్స్ , 336 హ్యాండ్ పంపులు ఉన్నాయని, అదే మాదిరిగా ఇప్పటివరకు 31 వేల ఆయిల్ బాల్స్ తయారు చేయడం జరిగిందని తెలిపారు. అన్ని గ్రామాలు పట్టణాలు వాటర్ ట్యాంక్స్ శుభ్రపరచడం, క్లోరినేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. నీటి నిల్వల్లో పిచికారి చేయడానికి టీమోపాస్, ఫాగింగ్ చేయడానికి మలాథియాన్, అన్ని  గ్రామపంచాయతీలు అందించడం జరిగిందని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆఫీసులు, సంఘ భవనాలు, మరియు పబ్లిక్ ప్రదేశాలలో నీటిని నీలువలను తొలగించేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసామాని తెలిపారు. 

జిల్లా పరిషత్ సీఈవో మాట్లాడుతూ అన్ని మండలాలలో వివిధ శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్  బి.ఎస్. లతా, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే. ప్రమోద్ కుమార్, ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ .శ్రీనివాస్ వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్యాధికారులు, ఎం.పీ. వో.లు మున్సిపల్ కమిషనర్లు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

సౌందర్య లహరి బృందం చే పారాయణం 

సౌందర్య లహరి బృందం చే పారాయణం  జగిత్యాల మే 27 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం, కూరగాయల మార్కెట్ లోని శ్రీనివాస, ఆంజనేయ,భవాని, శంకర, దేవాలయంలో ఈరోజు సౌందర్యలహరి గ్రూపు సభ్యులు గంప రజిని, నార్ల రజని, పాత రాధ, సౌందర్య హరి సామూహిక పారాయణం ఏర్పాటు చేశారు.వందలాది మంది మహిళలు ఈ పారాయణలో పాల్గొన్నారు. ప్రతి నెల అమావాస్య రోజు ఒక్కో...
Read More...
Local News 

పిడుగు శబ్దానికి ఇంటి పై పెచ్చులు రాలి బాలికకు గాయాలు

పిడుగు శబ్దానికి ఇంటి పై పెచ్చులు రాలి బాలికకు గాయాలు గొల్లపల్లి మే 27  (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి ఓ ఇంటి సమీపంలో పిడుగు పడింది. ఆ శబ్దానికి  ఓ ఇంటి విద్యుత్ పైపులు కాలి, పైకప్పు పెంచులు రాలి,ఇంట్లో  వున్న బాలిక పై పడడంతో చేతులకు గాయాలు అయ్యాయి.కుటుంబ సభ్యులు...
Read More...
Local News 

వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జగిత్యాల మే 27 (ప్రజా మంటలు)    కీటక జనితవ్యాధులపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశంగ్రామ మరియు పట్టణంలో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి  సీజనల్ వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్, ఆదేశించారు. స్థానిక ఐడిఓసి సమావేశ మందిరంలో  జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్  అధ్యక్షతన కీటక జనిత...
Read More...
Local News 

గంజాయి అనర్థాలపై యువతకు అవగాహన కార్యక్రమం

గంజాయి అనర్థాలపై యువతకు అవగాహన కార్యక్రమం బీర్పూర్ మే 27 ( ప్రజా మంటలు)      జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఎస్పీ  ఆదేశాల మేరకు  యువతలో గంజాయి నిర్మూలన అవగాహనలో భాగంగా బీర్పూర్ మండలం తుంగూరు లోని ప్రైవేట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్న యువకులకు గంజాయి అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా బీర్పూర్ ట్రైనీ ఎస్సై రాజు...
Read More...
Local News  Spiritual  

శ్రీ కాలభైరవ దేవాలయంలో అమావాస్య, మంగళవారం విశేష పూజలు

శ్రీ కాలభైరవ దేవాలయంలో అమావాస్య, మంగళవారం  విశేష పూజలు గొల్లపల్లి మే 27 (ప్రజా మంటలు):   గొల్లపల్లి  మండలం కోసనపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన కాలభైరవ దేవాలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. శని దేవుడి జన్మదినం, అమావాస్య మంగళవారం విశేష దినాన్ని పురస్కరించుకొని కాలభైరవ దేవాలయంలో భక్తులు స్వామి వారికి కూష్మాండ హారతి సమర్పించారు. జగిత్యాలజిల్లా తదితర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున...
Read More...
Local News  State News 

పంతులు దీక్ష ఫలించింది...బ‌డికి బాట దొరికింది

పంతులు దీక్ష ఫలించింది...బ‌డికి బాట దొరికింది దారికి అడ్డంగా ఉన్న గోడ‌ను కూల్చివేసిన  హైడ్రా  *ఏడాదిగా దొరకని పరిష్కారం...24 గంటల్లో అయింది... సికింద్రాబాద్ మే 27 (ప్రజామంటలు):      సికింద్రాబాద్‌లోని  చిల‌క‌ల‌గూడ దూద్‌బావి ప్రభుత్వ ప్రాథ‌మిక పాఠ‌శాల దారికి అడ్డంగా నిర్మించిన గోడను  హైడ్రా, జీహెచ్ఎమ్సీ అధికారులు మంగళవారం కూల్చివేశారు. సోమ‌వారం సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ నార్త్ జోన్ కార్యాల‌యం ఎదుట ప్రధానోపాధ్యాయుడు మ‌ల్లికార్జున్ ప్రహ‌రీ...
Read More...
Local News 

బ్రాహ్మణవాడిలో సమస్యలపై డా. కోట నీలిమ  పర్యటన, సమీక్ష

బ్రాహ్మణవాడిలో సమస్యలపై డా. కోట నీలిమ  పర్యటన, సమీక్ష వెంట జీహెచ్ఎమ్సీ, విద్యుత్,పోలీస్ శాఖ అధికారులువర్షాలకు ముందుగానే పనులు చేయాలని ఆదేశం    సికింద్రాబాద్ మే 27 (ప్రజామంటలు): సనత్‌నగర్ నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్‌లో  బ్రాహ్మణవాడి ప్రాంతంలో నెలకొన్న పలు దీర్ఘకాలిక సమస్యలను పరిశీలించేందుకు సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ  మంగళవారం అధికారులతో కలిసి విస్తృత పర్యటన నిర్వహించారు. లేన్...
Read More...
Local News 

సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి 

సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి    -రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్         జగిత్యాల మే 27 :   కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు సీనియర్ సిటీజేన్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ర్ట కార్యదర్శి  హరి ఆశోక్ కుమార్ డిమాండ్ చేశారు.మంగళవారం  సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా  కార్యాలయంలో  డివిజన్, మండల,గ్రామ ప్రతినిధులకు వయోవృద్ధుల సంరక్షణ చట్టం 2007 నియమావళి...
Read More...
State News 

సింగరేణి జాగృతి ఆవిర్భావం - కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ

సింగరేణి జాగృతి ఆవిర్భావం - కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తాం - యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం సింగరేణి 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను నియమించిన ఎమ్మెల్సీ కవిత సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతాం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణిని అంతం చేయాలని చూస్తోంది కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన విద్య, వైద్యం అందజేయాలి సింగరేణి...
Read More...
Local News 

వెల్గటూర్ పోలీస్ స్టేషన్  ఆకస్మిక  తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్.

వెల్గటూర్ పోలీస్ స్టేషన్  ఆకస్మిక  తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్. గొల్లపల్లి మే 27  (ప్రజ మంటలు): ఈ  సందర్బంగా ఎస్పీ స్టేషన్ పరిసరాలను పోలీస్ స్టేషన్  ఆవరణలో వాహనాల పార్కింగ్,5ఎస్ అమలు చేసిన తీరును, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వారి యొక్క డ్యూటీ ల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5ఎస్ విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు అదేవిధంగా ఫైల్స్, క్రమపద్ధతిలో...
Read More...
Local News 

2లక్షల 50వేల రూపాయల  ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

2లక్షల 50వేల రూపాయల  ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్     జగిత్యాల మే 27 ( ప్రజా మంటలు)    పట్టణ 6వ వార్డు కి చెందిన కొలగాని గంగ w/o రాజేందర్ వెన్నెముక సంబంధిత వ్యాధితో భాదపడుతుండగా గంగ ఆరోగ్య పరిస్థితి ని స్థానిక నాయకులు కోలగాని సత్యం జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నిమ్స్ లో శస్త్ర చికిత్స...
Read More...
Local News 

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన అహల్య భాయ్ త్రి శతాబ్ది వేడుకలు

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన అహల్య భాయ్ త్రి శతాబ్ది వేడుకలు జగిత్యాల మే 27 ( ప్రజా మంటలు)    సామాజిక సమరసత వేదిక జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహారాణి అహల్యాబాయ్ హోల్కర్  త్రిశతాబ్ది ఉత్సవ ముగింపు కార్యక్రమము గీత విద్యాలయం జగిత్యాలలో  నిర్వహించబడింది.    ఈ కార్యక్రమంలో విద్యార్థులకు  వ్యాసరచన, ఉపన్యాసం,చిత్రలేఖనం   మొదలైన అంశాలలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానము చేయడమైనది.బహుమతి ప్రధాన కార్యక్రమంలో డాక్టర్...
Read More...