పంతులు దీక్ష ఫలించింది...బడికి బాట దొరికింది
మీడియా ప్రభావం - వార్త వేసిన 24 గంటల్లో....
దారికి అడ్డంగా ఉన్న గోడను కూల్చివేసిన హైడ్రా
*ఏడాదిగా దొరకని పరిష్కారం...24 గంటల్లో అయింది...
సికింద్రాబాద్ మే 27 (ప్రజామంటలు):
సికింద్రాబాద్‌లోని చిలకలగూడ దూద్‌బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దారికి అడ్డంగా నిర్మించిన గోడను హైడ్రా, జీహెచ్ఎమ్సీ అధికారులు మంగళవారం కూల్చివేశారు. సోమవారం సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ నార్త్ జోన్ కార్యాలయం ఎదుట ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ రెడ్డి సీఎం గారు....! మా బడికి బాట వేయించండి.. అంటూ ప్లకార్డు పట్టుకుని ధర్నాకు దిగిన వార్త మీడియాలో ప్రసారం కావడంతో హైడ్రా రంగంలోకి దిగింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో ఇన్‌స్పెక్టర్ ఆదిత్య క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆ పాఠశాలకు వెళ్లే మార్గంలో అక్కడి నివాసితులు దారికి అడ్డంగా గోడను నిర్మించినట్లు, .దీంతో విద్యార్థులు స్కూల్ కు వెళ్లడానికి పక్కనే ఉన్నచిన్నపాటి గల్లి నుంచి వస్తున్నట్లు గుర్తించారు. విద్యార్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకుగాను దారికి అడ్డంగా నిర్మించిన ప్రహరీని తొలగించారు. జీహెచ్ ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్‌రావుతో పాటు సిబ్బంది కూడా ఉండి అడ్డు గోడ తొలగింపు పనులను పర్యవేక్షించారు.
ప్రహరీ గోడతొలగించిన చోట గేటు కూడ ఏర్పాటు చేస్తామని జోనల్ కమిషనర్ రవి కిరణ్‌వెల్లడించారు. తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించి, స్కూల్ కు దారిని కల్పించిన ముఖ్యమంత్రి, హైడ్రా, జీహెచ్ఎమ్సీ అధికారులతో పాటు మీడియాకు హెడ్మాస్టర్ మల్లికార్జున్ రెడ్డి, స్డూటెంట్స్ పేరేంట్స్ కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సౌందర్య లహరి బృందం చే పారాయణం

పిడుగు శబ్దానికి ఇంటి పై పెచ్చులు రాలి బాలికకు గాయాలు
.jpeg)
వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

గంజాయి అనర్థాలపై యువతకు అవగాహన కార్యక్రమం

శ్రీ కాలభైరవ దేవాలయంలో అమావాస్య, మంగళవారం విశేష పూజలు

పంతులు దీక్ష ఫలించింది...బడికి బాట దొరికింది

బ్రాహ్మణవాడిలో సమస్యలపై డా. కోట నీలిమ పర్యటన, సమీక్ష

సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి

సింగరేణి జాగృతి ఆవిర్భావం - కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ

వెల్గటూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్.

2లక్షల 50వేల రూపాయల ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన అహల్య భాయ్ త్రి శతాబ్ది వేడుకలు
