గంజాయి అనర్థాలపై యువతకు అవగాహన కార్యక్రమం
బీర్పూర్ మే 27 ( ప్రజా మంటలు)
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఎస్పీ ఆదేశాల మేరకు యువతలో గంజాయి నిర్మూలన అవగాహనలో భాగంగా బీర్పూర్ మండలం తుంగూరు లోని ప్రైవేట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్న యువకులకు గంజాయి అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది..
ఈ సందర్భంగా బీర్పూర్ ట్రైనీ ఎస్సై రాజు మాట్లాడుతూ...
గంజాయి ఇతర డ్రగ్స్ త్రాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, దాని ద్వారా బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని యువకులకు తెలియజేశారు. సెలవులలో దొరికిన సమయాన్ని కంప్యూటర్ శిక్షణ కోసం వినియోగిస్తున్నందుకు వారిని అభినందించారు. మరియు మంచి అలవాట్లతో మంచి భవిష్యత్తు ఉంటుందని వారికి తెలియజేశారు.
యువతపై వారి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని జీవిస్తారని వారికి తెలియజేసి ఎవరు కూడా వారి తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెడు అలవాట్లు కు గురికాకుండా ఉండాలని తెలియజేశారు.
ఎవరైనా గంజాయి కి అలవాటు పడిన, గంజాయి అమ్మిన, కొన్న, పోలీస్ వారికి తెలియజేయాలని చెప్పారు. బీర్పూర్ పోలీస్ స్టేషన్ నెంబర్ 8712656828 కి తెలియపరచాలని చెప్పారు. యువత ముఖ్యంగా ధూమపానం మద్యం గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని ఘంటా పథంగా చెప్పారు.గంజాయి నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
పిడుగు శబ్దానికి ఇంటి పై పెచ్చులు రాలి బాలికకు గాయాలు
.jpeg)
వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

గంజాయి అనర్థాలపై యువతకు అవగాహన కార్యక్రమం

శ్రీ కాలభైరవ దేవాలయంలో అమావాస్య, మంగళవారం విశేష పూజలు

పంతులు దీక్ష ఫలించింది...బడికి బాట దొరికింది

బ్రాహ్మణవాడిలో సమస్యలపై డా. కోట నీలిమ పర్యటన, సమీక్ష

సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి

సింగరేణి జాగృతి ఆవిర్భావం - కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ

వెల్గటూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్.

2లక్షల 50వేల రూపాయల ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన అహల్య భాయ్ త్రి శతాబ్ది వేడుకలు

ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పై రైతులకు అవగాహన పాల్గొన్న జిల్లా కలెక్టర్
