సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి
-రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్
జగిత్యాల మే 27 :
కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు సీనియర్ సిటీజేన్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ర్ట కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ డిమాండ్ చేశారు.మంగళవారం సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో డివిజన్, మండల,గ్రామ ప్రతినిధులకు వయోవృద్ధుల సంరక్షణ చట్టం 2007 నియమావళి 2011 పై అవగాహన కల్పించారు.
అనంతరం అసోసియేషన్ ముద్రించిన సీనియర్ సిటీజేన్స్ పిలుపు పుస్తకాలను హరి ఆశోక్ కుమార్ సంఘ సబ్యులకు,వివిధ సంఘాల ప్రతినిధులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తింపు పొందిన తమ అసోసియేషన్ సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారన్నారు.సీనియర్ సిటీజేన్స్ కోసం ప్రత్యేక సంక్షేమ శాఖ కేంద్రంలో, రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్నారు.వృద్ధుల సమావేశ భవనం కోసం హైదరాబాద్ లో,జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ భూమి కేటాయించి,భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని ,ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని,అన్నీ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందించాలన్నారు.,రైల్వే ఛార్జీల్లో వృద్ధులకు ఆపి వేసిన రాయితీలు పునరుద్ధరించాలని, పెన్షనర్ల కు ఆదాయపు పన్ను రద్దు చేయాలని,తల్లిదండ్రుల,వృద్ధుల పోషణ సంక్షేమ చట్టము 2007 లో ప్రతిపాదించిన సవరణ బిల్లు 2019 ని కేంద్రం పార్లమెంట్ లో పెట్టి ఆమోదింప జేయాలని డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో ,జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వేల్ముల ప్రకాశ్ రావు, కౌన్సెలింగ్ అధికారి పి.సి. హన్మంత్ రెడ్డి, కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం, జగిత్యాల డివిజన్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్,మెట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు వొజ్జెల బుచ్చిరెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కే.సత్యనారాయణ, నాయిని సంజీవ రావు, రాజ్ మోహన్, టి.రాజయ్య, డివిజన్ ల, మండలాల ,గ్రామాల సీనియర్ సిటీజేన్స్,వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పిడుగు శబ్దానికి ఇంటి పై పెచ్చులు రాలి బాలికకు గాయాలు
.jpeg)
వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

గంజాయి అనర్థాలపై యువతకు అవగాహన కార్యక్రమం

శ్రీ కాలభైరవ దేవాలయంలో అమావాస్య, మంగళవారం విశేష పూజలు

పంతులు దీక్ష ఫలించింది...బడికి బాట దొరికింది

బ్రాహ్మణవాడిలో సమస్యలపై డా. కోట నీలిమ పర్యటన, సమీక్ష

సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి

సింగరేణి జాగృతి ఆవిర్భావం - కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ

వెల్గటూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్.

2లక్షల 50వేల రూపాయల ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన అహల్య భాయ్ త్రి శతాబ్ది వేడుకలు

ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పై రైతులకు అవగాహన పాల్గొన్న జిల్లా కలెక్టర్
