నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన జూనియర్ లెక్చరర్లు
గొల్లపల్లి మే 25 :(ప్రజా మంటలు)
తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే జూనియర్ లెక్చరర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే జూనియర్ లెక్చరర్ లకు రెండవ వార్షిక ఇంక్రిమెంట్ ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ నిలుపుదల చేసినందుకు నిరసనగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే జూనియర్ లెక్చరర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష విధులకు హాజరైనారు.
తమకు న్యాయబద్ధంగా వచ్చేటువంటి వార్షిక ఇంక్రిమెంట్ ను కొందరు ప్రిన్సిపల్స్ అన్యాయంగా నిలిపివేశారు అని జూనియర్ లెక్చరర్లు ఆరోపించారు. తక్షణమే ఇంటర్మీడియట్ ఉన్నత అధికారులు స్పందించి తమకు వార్షిక ఇంక్రిమెంట్ ను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జగిత్యాల జిల్లా గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ _711 అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయకులు, ప్రాథమిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సౌందర్య లహరి బృందం చే పారాయణం

పిడుగు శబ్దానికి ఇంటి పై పెచ్చులు రాలి బాలికకు గాయాలు
.jpeg)
వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

గంజాయి అనర్థాలపై యువతకు అవగాహన కార్యక్రమం

శ్రీ కాలభైరవ దేవాలయంలో అమావాస్య, మంగళవారం విశేష పూజలు

పంతులు దీక్ష ఫలించింది...బడికి బాట దొరికింది

బ్రాహ్మణవాడిలో సమస్యలపై డా. కోట నీలిమ పర్యటన, సమీక్ష

సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి

సింగరేణి జాగృతి ఆవిర్భావం - కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ

వెల్గటూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్.

2లక్షల 50వేల రూపాయల ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన అహల్య భాయ్ త్రి శతాబ్ది వేడుకలు
