ఇక కరోనా కథ కంచికి చేరినట్టేనా...?
ఎండమిక్ దశకు చేరుకున్నట్లు నిపుణుల అభిప్రాయం
* ప్రస్తుతం ఒక్కో దేశంలో ఒక్కో వేరియంట్
*గతంలో మాదిరిగా గ్లోబల్ గా ఒకే వేరియంట్ విస్తరించని వైనం
సికింద్రాబాద్ మే25 (ప్రజామంటలు)::
గత ఐదు ఏండ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించి, లక్షలాది మంది ప్రాణాలను హరించిన కరోనా భూతం ఇక అంతిమ దశకు చేరుకుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. 2019 లో ఆల్ఫా వేరియంట్ తో ప్రపంచానికి భయం రుచి చూపించిన కోవిడ్ వైరస్ 2025 వరకు ఎన్నో వేరియంట్ లతో ఆయా దేశాల్లో వ్యాప్తి చెందుతునే ఉంది. ప్రస్తుతం జేఎన్ 1 వేరియంట్ చాలా తక్కువ వ్యాప్తిలో ఉందని, బహుశా గ్లోబల్ గా ఇదే కోవిడ్ వేరియంట్ చివరి దశ అవుతుందని గాంధీ ఆసుపత్రి క్రిటికల్ కేర్ మెడిసన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కిరన్ మాదాల అభిప్రాయ పడ్డారు. ఆయన ఆదివారం వెలుగుతో మాట్లాడుతూ...గత ఐదేండ్లలో కోవిడ్ మొదట్లో పాండమిక్ దశలో ప్రపంచ వ్యాప్తంగా ఒకే వేరియంట్ తీవ్ర స్థాయిలో వ్యాప్తిస్తూ, కోట్లాది మంది ఆరోగ్యాలపై ప్రభావం చూపిందన్నారు. ఆ తర్వాత వైరస్ ప్రభావం సగం వరకు తగ్గి, కొన్ని దేశాలకే పరిమితమవుతూ, దాని ప్రభావం మద్యస్థ స్థాయి (ఎపిడమిక్) కి పడిపోయిందన్నారు. ఇప్పడు ప్రపంచంలోని ఒక దేశంలో వెలుగు చూసిన వేరియంట్ మరో దేశంలో కనిపించడం లేదన్నారు. దీనిని బట్టి కరోనా ఎండమిక్ దశకు చేరుకుందని భావిస్తున్నామన్నారు. ఏదేని వైరస్ వ్యాప్తికి సాధారణంగా మూడు దశలు 1. పాండమిక్, 2. ఎపిడమిక్,3.ఎండమిక్ దశలు ఉంటాయన్నారు.
ప్రస్తుతం సింగపూర్ దేశంలో వెలుగు చూసిన ఎన్బీ1.8.1 వేరియంట్ మరే దేశంలో లేదని, మనదేశంలో ప్రస్తుతం ఉన్న ఎక్స్ ఎఫ్ జీ వేరియంట్ మరే దేశంలో లేదన్నారు. దీనిని బట్టి చూస్తే కరోనా వైరస్ బాగా బలహీనపడిపోయి, ఆయా దేశాలు, ప్రాంతాలలోని ప్రజల ఇమ్యూనిటీ పవర్ కు అనుగుణంగా అక్కడి వరకే పరిమితమవుతుందనే విషయం అర్థం అవుతుందన్నారు. ఒకవేళ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లయితే ఒకే మాదిరి వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా పాకేదన్నారు. ప్రతి వైరస్ కు ముగింపు దశలో ఎండమిక్ దశ ఉంటుందని, ప్రస్తుతం వేరియంట్ల వ్యాప్తి, వాటి తక్కువ తీవ్రతను లెక్కలోకి తీసుకుంటే ఇక కరోనా ముగింపు దశకు వచ్చిందని భావించవచ్చాన్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోదనలు చేస్తుందని, త్వరలో కరోన ఎండమిక్ పై ప్రకటన రావచ్చని పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పిడుగు శబ్దానికి ఇంటి పై పెచ్చులు రాలి బాలికకు గాయాలు
.jpeg)
వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

గంజాయి అనర్థాలపై యువతకు అవగాహన కార్యక్రమం

శ్రీ కాలభైరవ దేవాలయంలో అమావాస్య, మంగళవారం విశేష పూజలు

పంతులు దీక్ష ఫలించింది...బడికి బాట దొరికింది

బ్రాహ్మణవాడిలో సమస్యలపై డా. కోట నీలిమ పర్యటన, సమీక్ష

సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి

సింగరేణి జాగృతి ఆవిర్భావం - కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ

వెల్గటూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్.

2లక్షల 50వేల రూపాయల ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన అహల్య భాయ్ త్రి శతాబ్ది వేడుకలు

ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పై రైతులకు అవగాహన పాల్గొన్న జిల్లా కలెక్టర్
