గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ కమిటీ
పది మంది వైద్య నిపుణులతో కోవిడ్ కమిటీ ఏర్పాటు..
*60 కోవిడ్ బెడ్స్ తో మూడు వార్డుల ఏర్పాటు
సికింద్రాబాద్ మే 24 (ప్రజామంటలు):
హైదరాబాద్ లో కోవిడ్ కేసు నమోదైన నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి పాలన యంత్రాంగం అప్రమత్తమైంది. సూపరింటెండెంట్ డా. రాజకుమారి చైర్మన్ గా ఆయా వైద్య విభాగాలకు చెందిన 10 మంది వైద్య నిపుణులతో ప్రత్యేక కోవిడ్ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే 60 బెడ్లతో కూడిన 3 కోవిడ్ వార్డులను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ డా.కే సునీల్ తెలిపారు. ఇందులో అత్యవసర వైద్య వసతులు కలిగిన 15 బెడ్ లతో స్పెషల్ వార్డు ను ఎమర్జెన్సీ విభాగం వెనక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోవిడ్ లక్షణాలతో వచ్చిన పేషంట్లకు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. అలాగే కేసులు పెరిగినట్లయితే వైరస్ వేరియంట్ ఏంటో తెలుసుకోవడానికి జీనోమ్ స్వీక్వేన్సింగ్ కై శాంపిల్స్ ను వైరాలజీ ల్యాబ్ కు పంపిస్తామన్నారు.
కోవిడ్ కమిటీ ఏర్పాటు:
కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి పాలన యంత్రాంగం శనివారం ఆస్పత్రిలోని ప్రధాన వైద్య విభాగాల హెచ్ ఓ డి లతో కోవిడ్ కమిటీని ఏర్పాటు చేశారు ఇందులో చైర్మన్ గా సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, నోడల్ ఆఫీసర్ గా జనరల్ మెడిసిన్ హెచ్ఓడి ఎల్. సునీల్ కుమార్ లు వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కే సునీల్, ఆర్ ఎం ఓ 1 డాక్టర్ శేషాద్రి, ఫల్మనాలజీ హెచ్ఓడి డాక్టర్ కృష్ణమూర్తి, అనిస్తీసియా హెచ్ఓడి ఆవుల మురళీధర్, పీడియాట్రిక్ హెచ్ఓడి డాక్టర్ వాసుదేవ్, గైనకాలజీ హెచ్ ఓ డి డాక్టర్ రాధా, మైక్రో బయాలజీ హెచ్ ఓ డి డాక్టర్ పూజ, డ్యూటీ ఆర్ ఎం ఓ తో పాటు పీజీ వైద్యులు ఉంటారు. కోవిడ్ పాజిటివ్ బాధితులు భవిష్యత్తులో గాంధీలో అడ్మిట్ అయిన పరిస్థితుల్లో వారికి అందించే అత్యవసర వైద్యం, తదితర వసతులపై కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుందని డిప్యూటీ డాక్టర్ కే సునీల్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కోవిడ్ పేషంట్ల కోసం గాంధీ లో వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ వార్డులు సిద్దంగా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. కరోనా లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ను సంప్రదించాలన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కడెం ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ దాడులు

వృత్తి నిబద్దత తోనే ఉద్యోగులకు గుర్తింపు

ధర్మపురి పట్టణంలో గంజాయి పట్టివేత
.jpeg)
రాజమాత అహల్య బాయి శత జయంతి ఉత్సవాలు

ప్రజా సేవతోనే నాయకులకు గుర్తింపు

గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ కమిటీ

జేబీఎస్ లో పవర్ గ్రిడ్ ఉద్యోగుల శుభ్రత డ్రైవ్

పిడుగుపాటుతో పాడి ఆవు మృతి — రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి*

బోయిన్ పల్లి పీఎస్ పరిధిలో కలకలం - తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం

జీహెచ్ఎంసీ అసిస్టెంట్ సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు.

వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 న మద్యం దుకాణాలు మూసివేయాలి
