సాంకేతిక యుగంలో సనాతన మార్గ ప్రయాణం_ ఎడ్లబండ్ల ప్రయాణంతో నూతన అనుభూతితో భక్తజనం
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
భూపాల్ పల్లి 25 (ప్రజా మంటలు)
భూపాల్ పల్లి మండలం కాళేశ్వరం పుష్కరాలు ఈనెల 15 నుండి ప్రారంభమయ్యాయి 26వ తేదీ సోమవారంతో పరిసమాప్తమవుతాయి. కాగా ఆదివారం సెలవు దినం కావడంతో కాళేశ్వర పుష్కర స్నానానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ నుండి కాక ఆంధ్ర, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి భక్తులు తమ సొంత వాహనాల్లో ఉదయాపూర్వం నుండే కాళేశ్వరం చేరుకున్నారు. అంతేగాక తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ వారు వివిధ ప్రాంతాల నుండి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ పాఠశాలల బస్సులను ఆలయం నుండి పుష్కర స్నాన ఘాట్ల వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసింది. భక్తులు పొరుగు రాష్ట్రాల నుండి ద్విచక్ర వాహనాలపై రావడం జరిగింది .ట్రాఫిక్ సౌకర్యాలను ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు నియంత్రిస్తూ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను నియంత్రించ డానికి పలు సూచనలు చేయడము ద్విచక్ర వాహనాలపై పోలీసులు ట్రాఫిక్ నియంత్రించడానికి కృషి చేయడం జరిగింది.
అయినప్పటికీ గంటల సమయం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. అధికారులు పుష్కర ఘాట్ల వరకు వాహనాలను ఉంచడానికి పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వీటితోపాటు స్థానిక రైతులు ఎడ్లబండ్లపై భక్తులను రుసుము తీసుకొని పుష్కర ఘాట్ల వరకు భక్తులకు సేవలు అందించారు. రాకెట్ స్పీడు జెట్ స్పీడ్ లో రోబోల యుగంలో సాంకేతికత ఇంత అభివృద్ధి చెందినప్పటికీ ట్రాఫిక్ ఇబ్బందితో పలువురు మహిళలు చిన్నారులు వృద్ధులు పుష్కర స్నానానికి ఎడ్లబండ్లను వినియోగించడం చూస్తే ఇన్ని పుష్కర ఏర్పాట్లు ఉన్నప్పటికీ సనాతన మార్గంలోనే పలువురు భక్తులు ఎడ్లబండ్లపై పుష్కర స్నానానికి వెళ్లడం విశేషం. బండ్లపై వెళుతూ భక్తులు ఎంతో సంతోషంగా పుష్కర స్నానానికి వెళ్లడం అదొక మధుర అనుభూతిగా భావించారు.
పలు సంఘాల వారు ఉచితంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు .
*వీఐపీల తాకిడితో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పలే*
సోమవారం పుష్కర ముగింపు కావడంతో ఆదివారం సెలవు దినం కావడము భక్తులతో పాటు వీఐపీలు రావడంతో సామాన్య భక్తుల వాహనాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రతి వీఐపీతో పోలీసు పైలెట్ వాహనం, పలువురు పోలీస్ అధికారుల వాహనాలు, ఆ వాహనాల సైరన్ల మోతతో భక్తులను చికాకు పరిచాయి.
విఐపి ల కాన్వాయ్ తో సామాన్య భక్తుల వాహనాలను ఎక్కడికి అక్కడే నిలిపివేయడంతో ట్రాఫిక్ కు మరింత అంతరాయం ఏర్పడింది. సాయంత్రం వేళ గంగా హారతి కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇది ఏమైనాప్పటికీ భక్తులు భక్తి పారవశ్యంతో ఓపికగా ఆలయంలో లైన్లో నిల్చడం కానీ ఎన్నో కిలోమీటర్లు నడిచి పుష్కర స్నానానికి వెళ్లిన భక్తులు కూడా లేకపోలేదు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పిడుగు శబ్దానికి ఇంటి పై పెచ్చులు రాలి బాలికకు గాయాలు
.jpeg)
వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

గంజాయి అనర్థాలపై యువతకు అవగాహన కార్యక్రమం

శ్రీ కాలభైరవ దేవాలయంలో అమావాస్య, మంగళవారం విశేష పూజలు

పంతులు దీక్ష ఫలించింది...బడికి బాట దొరికింది

బ్రాహ్మణవాడిలో సమస్యలపై డా. కోట నీలిమ పర్యటన, సమీక్ష

సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి

సింగరేణి జాగృతి ఆవిర్భావం - కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ

వెల్గటూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్.

2లక్షల 50వేల రూపాయల ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన అహల్య భాయ్ త్రి శతాబ్ది వేడుకలు

ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పై రైతులకు అవగాహన పాల్గొన్న జిల్లా కలెక్టర్
