వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల మే 27 (ప్రజా మంటలు)
కీటక జనితవ్యాధులపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం
గ్రామ మరియు పట్టణంలో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి సీజనల్ వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్, ఆదేశించారు.
స్థానిక ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధ్యక్షతన కీటక జనిత మరియు సీజనల్ వ్యాధులపై, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
గత సంవత్సరం , సమన్వయంతో,సమర్థవంతంగా పనిచేసి డెంగ్యూ ఇతర సీజనల్ వ్యాధులను ఎదుర్కొనడంలో సఫలీకృతమయ్యామని తెలిపారు.
ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే నిర్వహించడంతో పాటగా ప్రతిరోజు డ్రై డే పాటించాలని, కేవలం జ్వరాలనే కాకుండా ఇంటి పరిసరాలలో నీటిని నిలువలు ఏమైనా ఉన్నచో, వెంటనే తొలగించాలనీ ప్రజలను అవగాహన పరచాలని తెలిపారు . వారానికి ఒకసారి సర్వే ఫలితాలను క్రోడీకరించి, తీసుకోవలసిన చర్యల గురించి నివేదికలు తయారు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాలు, వరదల వల్ల ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయే అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి, చేపట్టాల్సిన చర్యలు, ఈ .డి. డి. సమీపంలో ఉన్న గర్భిణులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు చేర్చి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
గ్రామ సెక్రెటరీలు మున్సిపల్ కమిషనర్ ఫాగింగ్ మిషన్స్ సిద్ధంగా ఉంచుకోవాలని, ఏమైన రిపేర్ ఉంటే వెంటనే చేయించాలని ఆదేశించారు.
వాటర్ లీకేజెస్ గుర్తించడం, వాటిని సరిచేయడం, వరదల సమయంలో ఏవైనా ప్రాంతాలు ముంపు గురైనట్టేది వారిని తరలించడానికి అనుకూలమైన సురక్షిత ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని, హైరిస్కు ప్రాంతాలను గుర్తించి, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటినుండి ప్రతి సమావేశంలో అధికారులందరూ సీజనల్ వ్యాధులు, డెంగు నివారణ చర్ల గురించి మాట్లాడుచూ, ప్రజలలో అవగాహన కల్పించాలని తెలిపారు. హాస్టల్స్ మరియు పాఠశాలల్లో పరిసరాల పరిశుభ్రత గురించి ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.
జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 296 ఫాగింగ్ మిషన్స్ , 336 హ్యాండ్ పంపులు ఉన్నాయని, అదే మాదిరిగా ఇప్పటివరకు 31 వేల ఆయిల్ బాల్స్ తయారు చేయడం జరిగిందని తెలిపారు. అన్ని గ్రామాలు పట్టణాలు వాటర్ ట్యాంక్స్ శుభ్రపరచడం, క్లోరినేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. నీటి నిల్వల్లో పిచికారి చేయడానికి టీమోపాస్, ఫాగింగ్ చేయడానికి మలాథియాన్, అన్ని గ్రామపంచాయతీలు అందించడం జరిగిందని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆఫీసులు, సంఘ భవనాలు, మరియు పబ్లిక్ ప్రదేశాలలో నీటిని నీలువలను తొలగించేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసామాని తెలిపారు.
జిల్లా పరిషత్ సీఈవో మాట్లాడుతూ అన్ని మండలాలలో వివిధ శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లతా, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే. ప్రమోద్ కుమార్, ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ .శ్రీనివాస్ వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్యాధికారులు, ఎం.పీ. వో.లు మున్సిపల్ కమిషనర్లు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు

కాంగ్రెస్ కా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం!

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు వీరసావర్కర్ జయంతి వేడుకలు
.jpg)
శాంతిభద్రతల కాపాడటంలో పోలీసులకు సహకరించండి..

హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్ కోర్సు చేసిన వారికి జాబ్స్ ఇవ్వండి..

గొల్లపల్లి మండల కేంద్రంలో తిరంగా యాత్ర...

ధన్వంతరి ఆలయం వరకు సిసి రోడ్డుపై ఎమ్మెల్యేకు వినతి
