ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.చిన్న హనుమాన్ జయంతి కి 900 మంది సిబ్బందితో పటిష్ట భద్రత

On
ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.చిన్న హనుమాన్ జయంతి కి 900 మంది సిబ్బందితో పటిష్ట భద్రత

            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 
కొండగట్టు ఏప్రిల్ 10 ( ప్రజా మంటలు)
 సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ*

 జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు లో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా,ఎలాంటి  అవాంచనీయ సంఘటనలు జరగకుండా 900 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. బందోబస్తుని 6  సెక్టార్స్ గా విభజించి 3  షిప్టుల పద్దతిన విధులు కేటాయించడం జరిగిందిని అన్నారు 

ఈ సందర్బంగా హనుమాన్ జయంతి  బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు సిబ్బందిని ఉద్దేశించి  ఎస్పీ  మాట్లాడుతూ ..... చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  విధులు నిర్వహించాలని సూచించారు.

ఏదైనా సమస్య ఎదురైతే జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని  సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు పోలీస్ సిబ్బంది ఓపికతో సలహాలు,సూచనలు ఇస్తూ భక్తుల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలని,ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అందరూ సమన్వయంతో విధులు నిర్వహిస్తూ జయంతి ఉత్సవాలను  విజయవంతం చేయాలన్నారు.

ముఖ్యంగా దేవస్థానం,మాల విరమణ  వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులు క్యూ లైన్ పాటించేలా చూడాలని,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా 24 గంటలు పోలీస్ నిఘా ఉంచాలని ప్రతి ఒక్క భక్తుడు ప్రశాంతమైన వాతావరణంలో ఆంజనేయ స్వామిని  దర్శించుకుని క్షేమంగా తిరిగి వెళ్లేవిధంగా ప్రతి పోలీస్ బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. 

*పార్కింగ్ ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు:* ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున   భారీ సంఖ్యలో వచ్చే వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసేలా చూడాలని,ట్రాఫిక్ ,పార్కింగ్ ప్రదేశాల్లో విధుల్లో ఉన్న సిబ్బంది ట్రాఫిక్ జామ్ అవకుండా నియంత్రణ చేయాలన్నారు. రాత్రి వేళలో ప్రమాదాలు జరగకుండా స్టాపర్స్, కోన్స్, స్టిక్కర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

*అనంతరం ఆలయ పరిసరాల్లో ఏర్పాటుచేయవలసిన భద్రత ఏర్పాటలను పరిశీలించి అదికారులకు పలు సూచనలు చేశారు.*  

*హనుమాన్ జయంతి సందర్భంగా కాలి నడకన వచ్చే భక్తులు రోడ్డుపైన వెళ్ళే వాహనాలు గమనిస్తూ నడవాలి*

హనుమాన్ దీక్ష తీసుకున్న దీక్షపరులు కాలినడకన కొండగట్టుకు వచ్చే సమయం లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రేడియం స్టికర్స్ ను వారి బ్యాగులకు, జెండా కు అంటించడం జరిగింది. రోడ్డు కు ఇరువైపులా నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాహనాలను గమనిస్తూ తమ యొక్క గమ్యస్థానానికి చేరుకోవాలని జిల్లా ఎస్పీ  సూచించారు.


ఈ కార్యక్రమంలో  డిఎస్పి లు రఘు చందర్, రాములు, రంగరెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ అరిఫ్ అలీ ఖాన్,సి.ఐ లు రవి ,రామ్ నరసింహారెడ్డి, సురేష్ ,అనిల్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు, వివిధ జిల్లాలకు చెందిన సి.ఐలు, ఎస్.ఐ లు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags

More News...

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                                               సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 11 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నవి. కాగా ఆదివారం రాత్రి 8 గంటలకు వసంతోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఫలాలు, పుష్పాలతో వేదికను అలంకరించి ఉత్సవమూర్తులను వేదికపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు....
Read More...
Local News 

పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                                                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ   జగిత్యాల మే 11 (ప్రజా మంటలు)వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కి జగిత్యాల జిల్లా కు అవసరమైన డ్రగ్స్ పెండింగ్  బిల్లు మంజూరు,జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో ఆక్సీజన్ ప్లాంట్ రిపేర్ చేయాలని,జగిత్యాల నూకపల్లి డబల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు వైద్య ఆరోగ్య సేవలు నిమిత్తం 2 ప్రైమరీ హెల్త్...
Read More...
Local News 

జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                                             సిరిసిల్ల. రాజేంద్ర  శర్మ  జగిత్యాల మే 11(ప్రజా మంటలు)పట్టణంలో ఓల్డ్ హైస్కూల్లో భారతదేశం లోనే మెగా మొబైల్ ఫెర్టిలిటీ క్యాంపు ఒయాసిస్ ఫెర్టిలిటీ జననీ యాత్రను ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ  తల్లి కావాలని ప్రతి ఆడబిడ్డ ముఖ్యమైన కోరిక... పిల్లలు కానీ వారికి ఇదొక...
Read More...
Local News  Spiritual  

ప్రాచీన ఉగ్రనరసింహా స్వామి టెంపుల్ లో ఘనంగా జయంతి

ప్రాచీన ఉగ్రనరసింహా స్వామి టెంపుల్ లో ఘనంగా జయంతి సికింద్రాబాద్, మే 11 (ప్రజామంటలు) : శ్రీనరసింహస్వామి జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సికింద్రాబాద్ ఆర్.పీ రోడ్డు బాటా సమీపంలో ఉన్న 200 ఏండ్ల నాటి స్వయంభూ  శ్రీ ఉగ్ర నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులను చెల్లించి, ఆశీర్వాదాలను పొందారు. ఆలయాన్ని...
Read More...
Local News  Spiritual  

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు (రామ కిష్టయ్య సంగన భట్ల.) సుప్రసిద్ధ ప్రాచీన పుణ్యక్షేత్ర మైన ధర్మపురిలో, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, ఆది వారం నరసింహ జయంతి ఉత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ నరసింహ నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజైన ఆది వారం, ఉదయాత్ పూర్వం నుండి, దేవస్థానంలోని ప్రధానాలయాలలో, శ్రీ యోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నరసింహ...
Read More...
Local News 

సహచర ఉద్యోగికి రూ,32,000 ఆర్థిక సహాయం

సహచర ఉద్యోగికి రూ,32,000 ఆర్థిక సహాయం గొల్లపల్లి మే 11 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని బిబి రాజు పల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన కీర్తిశేషులు రాసమల్ల తిరుపతి ఐదు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో  అతని సహచర ఉద్యోగులు మరియు రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శులు శ్రీ వేముల ప్రకాష్,గందే రామయ్య జోగినిపల్లి సత్యనారాయణ రావు, ఏం సత్యనారాయణ రావు...
Read More...
Local News 

సీనియర్ సిటిజన్ల చట్టంపై అవగాహనకే పోస్టర్ల  ప్రదర్శనలు

సీనియర్ సిటిజన్ల చట్టంపై అవగాహనకే పోస్టర్ల  ప్రదర్శనలు -సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.  జగిత్యాల మే 10 (ప్రజా మంటలు): వృద్ధుల సంరక్షణ చట్టం పై అన్నివర్గాల్లో అవగాహన కల్పించేందుకు గోడ పోస్టర్లను,కరపత్రాలను రూపొందించి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అతికించి ప్రదర్శిస్తున్నామని   తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ అన్నారు.శనివారం...
Read More...
Local News  State News 

ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి.. మహాప్రభో ... స్కై ఫౌండేషన్ వేడుకోలు

ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి.. మహాప్రభో ... స్కై ఫౌండేషన్ వేడుకోలు సికింద్రాబాద్  మే 11 (ప్రజా మంటలు): ఫుట్ పాత్ నిరాశయులను ప్రభుత్వం ఆదుకోవాలని పద్మారావు నగర్ లోని స్కై ఫౌండేషన్ ఆర్గనైజర్స్  కోరారు. తమ 276 వ అన్నదానం కార్యక్రమంలో భాగంగా ఆదివారం తమ వాహనంలో వెళ్లి సిటీలోని పలు ప్రధాన రహదారుల ఫుట్ పాతులపై నివసిస్తున్న నిరాశ్రయులకు అన్నదానాన్ని నిర్వహించారు. మండుతున్న ఎండలో అలమటిస్తున్న...
Read More...
Local News 

బోలక్ పూర్ లో ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్స్ 

బోలక్ పూర్ లో ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్స్  సికింద్రాబాద్ మే 11 (ప్రజా మంటలు):   బోలక్ పూర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఆదివారం మాతృ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్కూల్ కు చెందిన చిన్నారి విద్యార్థుల మాతృమూర్తులను ఆహ్వానించి,  వారికి పాటలు, ఆటల పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు.  మాతృమూర్తులందరికీ మెమెంటోళ్లు అందజేసి, ఘనంగా సత్కరించారు  స్కూల్
Read More...
Local News 

గాంధీ టెర్రస్ లపై రెడ్ క్రాస్ సింబల్ ల ఏర్పాటు..

గాంధీ టెర్రస్ లపై రెడ్ క్రాస్ సింబల్ ల ఏర్పాటు.. సికింద్రాబాద్ మే 10 (ప్రజామంటలు): దాయాది దేశం పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ద పరిస్థితుల నేపధ్యంలో సికింద్రాబాద్‌గాంధీ హస్పిటల్, గాంధీ మెడికల్‌కాలేజీల భవనాలపై శనివారం రెడ్‌క్రాస్‌సింబల్‌లను ఏర్పాటు చేశారు. జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ద సమయంలో ఆస్పత్రులపై దాడులకు పాల్పడకూడదనే నిబంధన ఉంది. ఈమేరకు గాను  అందుకు ఆయా భవనాలను ఆస్పత్రులుగా గుర్తించేందుకు ఆసుపత్రుల బిల్డింగ్ ల...
Read More...
Local News 

అమరవీరుడు మురళి నాయక్ ఆత్మ శాంతి చేకూర్చాలని కొవ్వొత్తుల ర్యాలీ 

అమరవీరుడు మురళి నాయక్ ఆత్మ శాంతి చేకూర్చాలని కొవ్వొత్తుల ర్యాలీ    గొల్లపల్లి మే 10 (ప్రజా మంటలు): పహల్గాంలో అమాయక భారతీయుల కాల్చి చంపిన  పాకిస్తాన్ తీవ్రవాదుల చేసిన సంఘటనకు ప్రతికారంగాఆపరేషన్ సింధూర్ లో భాగంగా  పాకిస్తాన్ లోని తీవ్రవాద శిబిరాలపై దాడులు జరుపుతున్న మన భారత వీర సైనికులు మద్దతుగా సంఘీభావ ర్యాలీ  బస్సు స్టాండ్ వద్ద నుండి  అంబేద్కర్ విగ్రహం వరకు అందులో...
Read More...
Local News 

రత్నాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం....ఎమ్మేల్యే డా.సంజయ్

రత్నాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం....ఎమ్మేల్యే డా.సంజయ్                                                           సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే10(ప్రజా మంటలు)మాజీ మంత్రి వర్యులు ఆదర్శప్రాయులు స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు  5వవర్ధంతి సందర్భంగా జగిత్యాల పద్మనాయక వెలమ సంక్షేమ సంఘం లోవారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  రాజకీయ నాయకునిగా,వ్యక్తి గా చాలా గొప్ప వ్యక్తి...
Read More...