సంప్రదాయ రీతిలో ధర్మపురిలో హనుమజ్జయంతి వేడుకలు
(రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494)
తెలంగాణ లోని ప్రాచీన పుణ్య క్షేత్రాలలో నొకటియై, పవిత్ర గోదావరీ నదీ తీరాన వెలసి, పలు దేవాలయాల సముదాయంతో అలరారుతున్న పుణ్య తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో శని వారం హనుమజ్జయంతి వేడుకలు సంప్రదాయ రీతిలో జరిగాయి. అంజనీ పుత్రుడైన మారుతి శరణు ఘోషలు, జయజయ ధ్వనాలు, భగవన్నామ స్మరణలు, భక్తి సంగీతాలు, వేద మంత్రాలతో సనాతన క్షేత్రంలో భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. ఉదయాత్పూర్వం ప్రత్యేకించి హన్మాన్ దీక్షాపరులు పవిత్ర గోదావరిలో మంగళ స్నానాలను ఆచరించి, నదీతీరాన గోదావరీ భద్రానదీ సంగమ స్థానాన వెలసిన దక్షిణాభిముఖుడైన భక్తాంజనేయ స్వామిని దర్శించు కున్నారు.
చారిత్రిక, పౌరాణిక నేపథ్యాన్ని కలిగిన ఈ ఆలయంలో హనుమజ్జయంతి సందర్భంగా ఉదయం ఆరు గంటలనుండి మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మన్యుసూక్త సంపుటి, సుందరాకాండ పారాయణాది ప్రత్యేక పూజలను అనువంశిక అర్చకులు మధ్వాచారి కపిల్ కుమార్ ఆద్వర్యంలో సాంప్రదాయ వేదోక్త రీతిలో నిర్వహించారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాంతర్గత ఆంజనేయస్వామి ఆలయంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్ ధర్మకర్తల ఆధ్వర్యంలో, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, సంపత్ కుమార్, సంతోష్ శర్మ, స్థానిక వేదపండితులు, అర్చకులు వొద్దిపర్తి నరసింహ మూర్తి , కళ్యాణ్ కుమార్ , కార్తీక్ ,నంబి అరుణ్ కుమార్, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్,సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
.
అలాగే చింతామణి చెరువు కట్ట సమీపాన అంజన్న సన్నిధిలో వేదవిదులు...కలశ గణపతి పూజ, పుణ్యాహ వాచనం, పురుష సూక్త, షోడశోపచార పూజలు, రుద్రా భిషేకం, మన్యుసూక్త, పురుషసూక్త, లక్ష్మీసూక్త పంచోపనిషత్ యుక్త అభి షేకాలు, అష్టోత్తరశతి నామార్చనలు, సుందరాకాండ పారాయణాలు, సప్తహారతులు, మంత్రపుష్పాది కార్యక్రమాలను నిర్వహించారు.
ఉపవాస దీక్షాదక్షులైన హన్మాన్ భక్తులు దేవస్థానంలో దర్శనాలు చేసుకుని, ప్రసాదాలనుకొని, పరమాన్నాలుగా గ్రహించారు.
రామ మందిరంలో తాడూరి రఘునాథ్ శర్మ,, బాల కిష్టయ్య శర్మ,
బలరాం శర్మ సాంప్రదాయ పూజనొనరించారు. అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛమైన త్రాగు నీటి సరఫరా చేశారు. దేవస్థానం వద్ద చైర్మన్ జక్కు రవీందర్ ధర్మ కర్తలు చల్లని మజ్జిగ అందించారు. గడ్డ హనుమాన్ దేవాలయ సమీపాన్ ఇందారపు రామయ్య, వేణుగోపాల్ మార్గదర్శకత్వంలో భోజనాలు ఏర్పాటు చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి
