కాంగ్రెస్ అమలు కాని హామీలపై BRS పోస్ట్ కార్డు ఉద్యమం - పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు
జగిత్యాల సెప్టెంబర్ 29 (ప్రజా మంటలు):
బి ఆర్ యస్ పార్టీ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చేయలేదని, అందుకే "అమలు కానీ హామీలఫై"
బి ఆర్ యస్ పార్టీ ఇంటింటికి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపడుతున్నామని కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రకటించారు.
జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ తో కలిసి.పార్టీ ఆఫీసులో పాత్రికేయుల సమావేశంలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఇందులో మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్, ఆనందరావు, శాంతపు రావు తదితరులు పాల్గొన్నారు.
విద్యాసాగర్ రావు మాట్లాడుతూ,జిల్లా ప్రజలకు, మహిళ సోదరిమనులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మహిళలకు పెద్ద పండుగ బతుకమ్మ. కేసీఆర్ హయాంలో బతుకమ్మ పండుగకు చీరలు అందించేవరని.. ఇప్పుడు 800రూపాయల ఇందిరమ్మ చీరలు మహిళలకు ఇస్తామన్నారు దాని ఊసే లేదు.#4000 పెన్షన్ చేస్తా అని, రైతులను గోస పెట్టుడు.. ఢిల్లీకి సంచులు మోసుడు...
తెలంగాణ కు తండ్రి లoటి కేసీఆర్ గారిని తిట్టడం.. పిచ్చి మాటలు బంద్ చెయ్.ప్రజలను మోసం చేస్తేనే ఓట్లు వస్తాయని నీవే చెప్పినవ్.. అందుకే ప్రజలు ఇప్పుడు అన్ని గమనిస్తున్నారని అన్నారు.
దావ వసంత సురేష్ గారు మాట్లాడుతూ..నేను మాట్లాడిన మాటలు వార్తలు రాకుండ జగిత్యాల స్థానిక నాయకులు మీడియా యాజమాన్యం తో ఒత్తిడి తీసుకువచ్చి వార్తలు వేయద్దు అని చెప్పడన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.. మీడియా సమాజానికి 4వ స్తంభం అని అన్నారు.
మార్పు మార్పు అని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి..
బతుకమ్మ పండుగకు ఇస్తామన్నా చీరలు ఏవి.. మహిళ సంఘాలకు ఇవ్వలేదు...రేషన్ కార్డు ఉన్న అర్హులైన మహిళలకు బతుకమ్మ చీరలు ఇవ్వాలి..తులం బంగారం హామీ ఏమైంది.. అన్ని హామీలు మోసమే. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నేతన్నలు చీరలు తయారు చేయలేదనడం మీ నిర్లక్ష్యనికి నిదర్శనమని అన్నారు.
స్థానిక ఎన్నికల్లో మీకు బుద్ది చెపుతాము. కేసీఆర్ హయాంలో బీసీ, యస్. సి, యస్. టి మైనారిటీ వర్గాల ప్రజలకు న్యాయం జరిగింది..పార్లమెంట్ లో చట్టం తర్వాత సమన్యాయం, చట్టభద్దత లభించి బి సి లకు న్యాయం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్,పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద్ రావు, ఉపాధ్యక్షులు వొళ్లెం మల్లేశం, జగిత్యాల రూరల్, అర్బన్, సారంగాపూర్, బీర్పూర్, రాయికల్ మండల అధ్యక్షులు ఆయిల్నేని ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, తెలు రాజు,నేరెళ్ల సుమన్, బర్కo మల్లేశం, మాజీ జడ్పీటీసీ కొలుముల రమణ, నాయకులు పునుగోటి కమలాకర్ రావు సాగి సత్యం రావు, కమలాకర్ రావు హరీష్ కల్లూరి, ఆది రెడ్డి,ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)
ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!
