పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి
కాంగ్రెస్ కార్యకర్తల హక్కులు నిలబెట్టడమే నా బాధ్యత
జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో స్థానిక సంస్థల సమాయుత్త సమావేశంలో మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ ప్రకారం ఎవరైతే పోటీ చేయాలనుకునే అభ్యర్థులు వారి యొక్క నామినేషన్ ప్రక్రియలో కుల ధ్రువీకరణ పత్రం తప్పకుండా నమోదు చేయాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు జడ్పిటిసి స్థానాలకు ప్రతి మండలం నుంచి ముగ్గురి పేర్లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రతిపాదించడం జరిగినది
కాంగ్రెస్ హై కామాండ్ నుండి బీఫామ్ ఏ అభ్యర్థికి అయితే వస్తుందో వారు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా ఎన్నికలలో నిలిచి ఉంటారు
ఎవరైతే ఎంపిటిసి ఆశావాహుల అభ్యర్థులు ఉన్నారో ఏకాభిప్రాయానికి వచ్చి నిల్చునే అభ్యర్థిని బలపరచాలి.ఏ రాజకీయ పార్టీలోనైనా క్షేత్రస్థాయి లో కార్యకర్తలు బలంగా ఉంటేనే ఆ పార్టీ బలంగా ఉంటుంది
నా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో నేను రాజకీయంగా బలంగా ఉండటానికి కారణం క్షేత్రస్థాయిలో నా కోసం కష్టపడుతున్న నా పార్టీ కార్యకర్తలు మాత్రమే
గతంలో టిడిపి బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా జగిత్యాల నియోజకవర్గం లో మండల పరిషత్ జిల్లా పరిషత్ మున్సిపాలిటీలలో మనమే గెలిచాం
ఈ వచ్చే ఎన్నికలలో కూడా మనమే గెలవబోతున్నాం అభ్యర్థుల ఎంపిక కూడా కార్యకర్తల సూచన మేరకే జరుగుతుంది
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థులను ఎంపిక చేసుకోవటం మరియు గెలిపించుకోవడం కార్యకర్తల బాధ్యత
కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలు జనంలోకి తీసుకెళ్దాం.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల నుండి ఇవ్వని రేషన్ కార్డులు ఇచ్చాం
2 లక్షల లోపు ఉన్న రైతు రుణాలను రైతు రుణమాఫీ చేశాం.సన్న రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ అందజేశం
200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ అమలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాం
కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ప్రజల లోకి తీసుకెళ్తూ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసే విదంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలి
కాంగ్రెస్ సంబంధం లేని వారు కాంగ్రెస్ సభ్యత్వం లేని వారు బి ఫామ్ మాకే వస్తాయి అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు
కాంగ్రెస్ బీ ఫామ్ అడగడానికి నీవు ఎవరు అని అన్నారు.నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో కాంగ్రెస్ కార్యకర్తల బలమే నా బలం.నా రాజకీయ జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్న కూడా కార్యకర్తల సూచనల మేరకే నిర్ణయం తీసుకున్నాను
కాంగ్రెస్ కార్యకర్తల హక్కులు నిలబెట్టడమే నా బాధ్యత
నా ప్రజా జీవితంలో నాకు ఎలాగైతే ఇన్ని రోజులు మీరు అండగా నిలిచారో మీకు అండగా నిలవాల్సిన బాధ్యత నాపై ఉంది.100కు 100% మన సూచనలకు అభిప్రాయాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

హర్యానా ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ ఆత్మహత్య -డీజీపీ తో సహా 7 గురిపై FIR

పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)