అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కోజాగరి పౌర్ణమి వేడుకలు
జగిత్యాల అక్టోబర్ 6 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో సోమవారం అర్ధరాత్రి శరద్ పౌర్ణమి (కోజాగరి పౌర్ణమి) వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఆశ్వీజ పౌర్ణమి పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ప్రతిమకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు.
నారాయణ సూక్తము, శ్రీ సూక్తం, పురుష సూక్తంతో పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పాలల్లో చంద్రుని దర్శించుకున్నారు. ఈరోజు చంద్రుని నుండి షోడశ కళలతో అమృతధారలు కురుస్తాయని విశ్వాసంతో రాత్రి 10 నుండి 12 గంటల మధ్య కోజాగరి పూర్ణిమ పూజ నిర్వహించి అమ్మవారికి ప్రీతిపాత్రమైన పాయసం నివేదించి పంపిణీ చేశారు .పూజ అనంతరం వేద ఆశీర్వచనం చేశారు.
వైదిక క్రతువులు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ నిర్వహించారు. వైదిక క్రతువులో రుద్రంగి గోపాల కృష్ణ శర్మ ,రుద్రాంగి రాఘవేంద్ర శర్మ, బండపెల్లి కార్తిక్ శర్మలు పాల్గొన్నారు. హరిహరాలయ అధ్యక్షులు చాకుంట వేణు మాధవరావు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు .అఖిల బ్రాహ్మణ సేవా సంఘం మరియు హరిహరాలయం కార్యవర్గ బాధ్యులు పాల్గొన్నారు. రేపల్లె హరికృష్ణ భక్తి గీతాలు ఆలపించగా భక్తులను ఎంతగానో అలరించాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
హర్యానా ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ ఆత్మహత్య -డీజీపీ తో సహా 7 గురిపై FIR

పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి
