చేనేత రంగంపై జీ.ఎస్.టీ. ఎత్తివేయాలి - వారసత్వ చేనేత సంస్కృతిని కాపాడాలి
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాసిన జీ. చిన్నారెడ్డి
హైదరాబాద్ ఆగస్ట్ 22 (ప్రజా మంటలు):
చేనేత రంగంపై గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ( జీ.ఎస్.టీ. ) ఎత్తివేయాలని, వారసత్వ చేనేత సంస్కృతిని కాపాడాలని కోరుతూ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి,కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు శుక్రవారం లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తరువాత అధిక సంఖ్యలో చేనేత రంగంలోనే ఉపాధి పొందుతున్నారని చిన్నారెడ్డి గారు ఆ లేఖలో పేర్కొన్నారు.
చేనేత రంగంపై గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ( జీ. ఎస్. టీ ) విధించడం వల్ల చేనేతపై ఆధారపడిన కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని చిన్నారెడ్డి వివరించారు.
చేనేత రంగంపై జీ. ఎస్. టీ. ని మినహాయింపు ఇవ్వాలని, వారసత్వ చేనేత సంస్కృతిని కాపాడాలని, గ్రామీణ చేనేత చేతివృత్తుల కుటుంబాలను ఆదుకోవాలని చిన్నారెడ్డి ఆ లేఖలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరారు.
ఈ మేరకు సెంటర్ ఫర్ మానిటరింగ్ రూరల్ ఇండియన్ ఎకానమీ అధ్యక్షులు జై ప్రకాష్ రాపోలు తనను కోరుతూ రాసిన లేఖను జత చేస్తున్నట్లు, రానున్న జీ. ఎస్. టీ. సమావేశంలో చేనేత రంగానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చిన్నారెడ్డి విజ్ఞప్తి చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
