అందరూ అనుకున్నట్లే ఎలాంటి ఒప్పందం లేకుండా ముగిసిన ట్రంప్ -పుతిన్ సమావేశం

On
అందరూ అనుకున్నట్లే ఎలాంటి ఒప్పందం లేకుండా ముగిసిన ట్రంప్ -పుతిన్ సమావేశం

జెలెన్స్కి - పుతిన్ ల సమావేశం ?
ఇక జెలెన్స్కి చేతుల్లోనే....ట్రంప్
నిర్మాణాత్మక సమావేశం - పుతిన్ 

అలాస్కా ఆగస్ట్ 16:

 అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్  ల మధ్య జరిగిన కీలక సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. దాదాపు 3 గంటలకు పాటు సమావేశం జరిగింది. అయితే ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి.

ట్రంప్-పుతిన్ అలాస్కా శిఖరాగ్ర సమావేశం ముఖ్యాంశాలు: ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ముగించడంపై వ్లాదిమిర్ పుతిన్‌తో ఎటువంటి ఒప్పందం లేదని డోనాల్డ్ ట్రంప్ అన్నారు
రష్యా పుతిన్‌తో విస్తృత స్థాయిలో ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రశంసించారు, కానీ అద్భుతమైన స్నేహపూర్వక సమావేశం ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై ఎటువంటి ప్రత్యేకతలు ఇవ్వలేదు.

జెలెన్స్కి చేతుల్లోనే....ట్రంప్

అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇరువురు నేతలు భేటీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, సమావేశం ఫలప్రదమైందని పేర్కొన్నారు. భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు.

డీల్ పూర్తికావడంపై నిర్ణయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేతుల్లోనే ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫాక్స్ న్యూస్ ప్రతినిధి సియాన్ హానిటీతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ఆయనకు సూచిస్తానని చెప్పారు.

జెలెన్స్కి - పుతిన్ ల సమావేశం ?

“ఒప్పందం చేసుకోవాలని జెలెన్స్కీకి సూచిస్తా. కానీ, వాళ్లు అందుకు నిరాకరించే అవకాశం ఉంది. రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్-జెలెన్స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉంది” అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

పుతిన్ తో ఏయే విషయాలు చర్చించారు..? ఇంకా మిగిలి ఉన్న అంశాలు ఏంటనే విషయంపై వివరించేందుకు ట్రంప్ నిరాకరించారు.

అంతకుముందు పుతిన్ మాట్లాడుతూ.. జెలెన్స్కీతో భేటీ అయ్యేందుకు వ్యతిరేకం కాదని, కొన్ని షరతులకు తప్పనిసరిగా అంగీకరించాలన్నారు.సంతకాలు చేయడానికి శాంతి ఒప్పందం సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే భేటీ ఉంటుందని క్రెమ్లిన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.download (10)

చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలన పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్పై సంతకం చేసే వరకు ఒప్పందం జరగదన్నారు.

త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. మళ్లీ పుతినన్ను కలుస్తానని చెప్పగా, తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్ పేర్కొన్నారు.

నిర్మాణాత్మక సమావేశం - పుతిన్ 

పుతిన్ మాట్లాడుతూ.. అలాస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయతీగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ట్రంప్నకు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్తో మాస్కో మంచి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్ వెల్లడించారు. ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరో మారు పేర్కొన్నారు.

 

Tags

More News...

Local News 

స్కందగిరి లో ఆది కృత్తిక పాల్గుడ ఉత్సవాలు

స్కందగిరి లో ఆది కృత్తిక పాల్గుడ ఉత్సవాలు శ్రీసుబ్రహ్మాణ్యస్వామివారికి క్షీరాభిషేకం, లక్షార్చన    మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం సికింద్రాబాద్, ఆగస్ట్ 16 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో శనివారం ఆది కృత్తిక  పాల కావడి  ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.  ఉదయం నుంచి వందలాది మంది భక్తులు ఆలయానికి చేరుకొని భుజాన పాల కావడి ధరించి గిరిప్రదక్షిణలు చేశారు....
Read More...
Local News 

బేగంపేట లో వాజ్ పేయి వర్థంతి

బేగంపేట లో వాజ్ పేయి వర్థంతి సికింద్రాబాద్, ఆగస్ట్ 16 (ప్రజామంటలు): భారత రత్న , దివంగత మాజీ ప్రధాని  అటల్ బిహారీ వాజ్ పేయి7 వ వర్ధంతిని శనివారం  బేగంపేట్ బిజెపి కార్యాలయంలో నిర్వహించారు. రాష్ర్ట బీజేపీ యువమోర్చా నాయకులు మర్రి పురూరవరెడ్డి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అటల్ బిహారీ వాజ్ పేయి దేశానికి చేసిన సేవలను...
Read More...
Local News  Spiritual   State News 

యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు   (రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి క్షేత్ర దేవస్థాన అంతర్గతంగా ఉన్న యమ ధర్మరాజు మందిరంలో శుక్ర వారం భరణీ నక్షత్ర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఇక్కడి యమ ధర్మరాజు మందిరం, విశేష ప్రాధాన్యతను సంతరించు కుంది. భారతావని లోనే అరుదుగా, అపు రూపంగా, క్షేత్రంలో వెలసిన "యమ ధర్మరాజును దర్శిస్తే", "యమపురి" ఉండబోదని...
Read More...
Local News  Spiritual  

ఇబ్రహీంపట్నం మండల వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఇబ్రహీంపట్నం మండల వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇబ్రహీంపట్నం ఆగస్టు 16 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో శనివారం శ్రీ కృష్ణా జన్మ ష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని మహిళలు తమ చిన్నారులతో కలిసి ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. తమ చిన్నారులను కన్నయ్య,...
Read More...
Local News 

ధర్మపురి లక్ష్మీ నర్సింహా స్వామిని దర్శించుకున్న నిజమాబాద్ అర్బన్  మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త

ధర్మపురి లక్ష్మీ నర్సింహా స్వామిని దర్శించుకున్న నిజమాబాద్ అర్బన్  మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త ధర్మపురి ఆగస్టు 16 (ప్రజా మంటలు): లక్ష్మీ నర్సింహా స్వామిని నిజమాబాద్ అర్బన్  మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త బిగాల, సోదరుడు బి ఆర్ ఎస్ ఎన్ ఆర్ ఐ ప్రతినిధి మహేష్ గుప్త బిగాల దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బి ఆర్ఎస్ హయంలో తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి...
Read More...
National  State News 

ఈ నెల 19 - 20 తేదీలలో RSS అత్యవసర సమావేశం

ఈ నెల 19 - 20 తేదీలలో RSS అత్యవసర సమావేశం బీజేపీ పెద్దలను కలవరపెడుతున్న RSS సమావేశం న్యూ డిల్లీ ఆగస్ట్ 16: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 2025 ఆగస్టు 19-20 తేదీలలో న్యూ ఢిల్లీలో జరిగే సమావేశం ఒక అత్యవసర ఆర్థిక సమూహ సమావేశం నిర్వహిస్తుంది. ఈసమావేశం ఏర్పాటుపై బీజేపీ ఉన్నత వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఎజెండా అంశాలు ఏవైనా, నిన్నటి...
Read More...
Local News  State News 

పురాతన ఉన్నత పాఠశాలలో 79 వ స్వాతంత్ర్య దిన వేడుకలు - విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతి 

పురాతన ఉన్నత పాఠశాలలో 79 వ స్వాతంత్ర్య దిన వేడుకలు - విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతి  జగిత్యాల ఆగస్ట్ 17 (ప్రజా మంటలు): పురాతన ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ప్రభాత భేరి నిర్వహించి, పాఠశాలలో ఉదయం 8-30 ని. లకు ప్రధానోపాద్యురాలు చంద్రకళ పతాక ఆవిష్కరణ చేశారు. తదనంతరం జరిగిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆనందరావు, ఉపాధ్యాయ బృందం తో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.     సమావేశంలో విద్యార్థులు   ఈ...
Read More...
National  Filmi News 

150 కోట్ల వసూలు చేసిన "రజనీకాంత్ - నాగార్జున" ల కికూలి:

150 కోట్ల వసూలు చేసిన చెన్నై ఆగస్టు 16: ‘కూలీ’: రజనీకాంత్-లోకేశ్ కనగరాజ్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ₹150 కోట్లకు పైగా వసూలు చేసింది. మిశ్రమ స్పందతో ఈ చిత్రం బాగానే వసూలు చేసింది.రజనీకాంత్, నాగార్జున, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, ఉపేంద్ర మరియు శ్రుతి హాసన్ వంటి స్టార్-స్టడెడ్ తారాగణంతో కూడిన ‘కూలీ’ని సన్...
Read More...
National  Filmi News  State News 

మలయాళ సినిమా తారల సంఘానికి మహిళా నాయకత్వం

మలయాళ సినిమా తారల సంఘానికి మహిళా నాయకత్వం కొచ్చి ఆగస్టు 16: మలయాళ నటుల సంఘమైన AMMA కు నాయకత్వం వహించిన తొలి మహిళలుగా శ్వేతా మీనన్, కుక్కు పరమేశ్వరన్ చరిత్ర సృష్టించారు కేరళ,మలయాళ నటుల సంఘమైన AMMA కు నాయకత్వం వహించిన తొలి మహిళలుగా శ్వేతా మీనన్, కుక్కు పరమేశ్వరన్ చరిత్ర సృష్టించారు హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో, దేవన్ మరియు రవీంద్రన్ లను...
Read More...
National  Local News  Sports  State News 

79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగిత్యాల బాస్కెట్బాల్ క్రీడాకారుల ఆనంద హేలా.

79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగిత్యాల బాస్కెట్బాల్ క్రీడాకారుల ఆనంద హేలా. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల ఆగస్టు 15 (ప్రజా మంటలు) :  79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా క్రీడాకారులు, క్రీడాభిమానులు, క్రీడా పోషకులకు మనస్ఫూర్తిగా సీనియర్ బాస్కెట్ బాల్ కోచ్ లు, క్రీడాకారులు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆనంద సమయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా భాగంగా సీనియర్ క్రీడాకారుల కిట్ (ఆట దుస్తులు)...
Read More...
Local News 

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం జగిత్యాల ఆగస్ట్ 15 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని  శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వారి శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా  22వ రోజు ఆలయంలో ఘనంగా సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం హనుమాన్ చాలీసా, పల్లకి సేవ ఊoజల్ సేవ, ఘనంగా జరిగింది. అనంతరం నిర్వాహకులు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో
Read More...
National  International   State News 

అందరూ అనుకున్నట్లే ఎలాంటి ఒప్పందం లేకుండా ముగిసిన ట్రంప్ -పుతిన్ సమావేశం

అందరూ అనుకున్నట్లే ఎలాంటి ఒప్పందం లేకుండా ముగిసిన ట్రంప్ -పుతిన్ సమావేశం జెలెన్స్కి - పుతిన్ ల సమావేశం ? ఇక జెలెన్స్కి చేతుల్లోనే....ట్రంప్ నిర్మాణాత్మక సమావేశం - పుతిన్  అలాస్కా ఆగస్ట్ 16:   అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్  ల మధ్య జరిగిన కీలక సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. దాదాపు 3 గంటలకు పాటు సమావేశం ట్రంప్-పుతిన్...
Read More...