రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం
కిమ్స్ ఆసుపత్రిలో పదేళ్ళుగా రక్తమూలుగ మార్పిడి
*విదేశీ రోగులకు విజయవంతంగా చికిత్సలు
*50శాతం మ్యాచ్ ఉన్నా కూడ సత్పలితాలు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 05 (ప్రజామంటలు) :
రక్తక్యాన్సర్‌తో పాటు సికిల్ సెల్ డిసీజ్, తలసీమియా, ఎప్లాస్టిక్ ఎనీమియా వంటి తీవ్రమైన వ్యాధుల బాధితులకు బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ ప్రాణదాయక చికిత్సగా నిలుస్తోంది. ఈ సేవలో హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రి పది సంవత్సరాలుగా విశేష ఫలితాలను సాధించింది.
50శాతం మ్యాచ్ ఉన్నా విజయవంతం
మునుపటి కాలంలో రక్తమూలుగ దాతలు పెద్ద కుటుంబాల వల్ల సులభంగా లభించేవారు. ఇప్పుడు చిన్న కుటుంబాల కారణంగా దాతలు దొరకడం కష్టమవుతోంది. అలాంటి పరిస్థితుల్లో కేవలం 50శాతం మ్యాచ్ ఉన్నా కూడా అత్యాధునిక సాంకేతికతతో విజయవంతంగా మార్పిడి చేయగలగడం కిమ్స్ ప్రత్యేకతగా నిలిచింది.
150 మందికి పైగా రోగులకు మార్పిడి
గత పది ఏళ్లలో 150 మందికి పైగా రోగులకు రక్తమూలుగ మార్పిడి చేసి, సత్ఫలితాలు సాధించినట్లు హెమటో ఆంకాలజీ, స్టెమ్ సెల్, బోన్‌మారో ట్రాన్స్ ప్లాంట్ విభాగాధిపతి డా. నరేంద్రకుమార్ తోట తెలిపారు. జాతీయ సగటు కంటే మా ఆస్పత్రిలో విజయం శాతం ఎక్కువ. ఇది మా నిపుణుల ప్రతిభ, ఆధునిక సదుపాయాల ఫలితం అని ఆయన పేర్కొన్నారు.
విదేశీ రోగులకూ సేవలు భారతీయులకే కాకుండా పలు ఆఫ్రికా, గల్ఫ్ దేశాల రోగులకు కూడా 50 శాతం మ్యాచ్ ఉన్నప్పటికీ విజయవంతంగా మార్పిడి చేశామని ఆయన వివరించారు. అయితే ఇన్ఫెక్షన్లు పెద్ద సవాలుగా నిలుస్తున్నాయని, వాటి నివారణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
విజయోత్సవ వేడుక కిమ్స్ ఆస్పత్రి బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ 10 ఏళ్ల విజయోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాదు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, ఫిలాంత్రోపిస్టులు సుధా రెడ్డి, పింకీ రెడ్డి, కిమ్స్ గ్రూప్ సీఎండీ డా. భాస్కర్ రావు, సీఈఓ డా. అభినయ్, మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా బోన్ మారో దానం చేసిన దాతలు, విజయవంతంగా చికిత్స పొందిన రోగులు కూడా పాల్గొన్నారు. మరింత మంది ముందుకొచ్చి బోన్ మారో దానం చేస్తే, మరెన్నో ప్రాణాలు రక్షించవచ్చు అని డా. నరేంద్రకుమార్ తోట పిలుపునిచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్జెండర్లు - గణేశ్ నిమజ్జనోత్సవం బందోబస్తు లో కూడా! ఎస్పీ అశోక్ కుమార్

శిశువు కడుపు నుండి ఇద్దరు పరాన్నజీవి కవలల తొలగింపు

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ అశోక్ కుమార్

జైలు నుంచి ఖైదీల పరారీ
.jpg)
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్

గురువుల రుణం తీర్చుకోలేనిది - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
