గాంధీ దారుణ పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం
అడ్వకేట్ రామారావు పిటిషన్ కు స్పందన: కేసు నమోదు
అక్టోబర్ 27 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
సికింద్రాబాద్ ఆగస్టు 07 (ప్రజా మంటలు) :
సికింద్రాబాద్ గాంధీ దవాఖానల దారుణమైన పరిస్థితులపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం సీరియస్ అయింది. ఏడాది కాలం నుంచి లిఫ్టులు సరిగా పనిచేస్తుండకపోవడంతో డాక్టర్లు, పేషెంట్లు, నర్సులు, మెట్లు ఎక్కడానికి , దిగడానికి ఇబ్బందులు పడుతున్నారని సిటీకి చెందిన ప్రముఖ అడ్వకేట్ రామారావు ఇమ్మానేని గతంలో రాష్ర్ట మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.
అలాగే వంటగదుల్లో జిర్ర పురుగులు తిరుగుతున్నాయని, పేషంట్లు పడుకునే బెడ్లు నాణ్యతగా లేవని తన ఫిర్యాదు లోపేర్కొన్నారు. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, ఆసుపత్రిలో రోగులు, డాక్టర్లు ఎదుర్కునే సమస్యల గురించి ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియాల్లో వార్త కథనాలు వస్తున్నప్పటికీ సంబందిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అడ్వకేట్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఆసుపత్రి కి చెందిన డ్రైనేజీ వ్యవస్థ పూర్తి దారుణంగా తయారైందన్నారు.
మురుగు నీరు ఆసుపత్రి ఆవరణలో పొంగుతుందని, దుర్వాసన, దోమలతో రోగులు మరింత అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. కుక్కల బెడద బాగా పెరిగిందని, నేరుగా పై అంతస్తుల్లోని రోగుల వార్డుల్లోకి వస్తూ, అందరిని భయప్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఇక పోస్టుమార్గం నిర్వహించే మార్చురీ లో అయితే పరిస్తితులు దారుణంగా ఉన్నాయి. శవాలు రోజుల తరబడిగా పేరుకుపోతుండటంతో, అవి పూర్తిగా కుళ్ళిపోయి, భరించలేదని దుర్వాసన చుట్టు ప్రాంతాలకు వ్యాపిస్తుంది. దాంతో పద్మారావునగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల తరచుగా ఆసుపత్రి ప్రధాన విభాగాలు, అత్యవసర వైద్య సేవలు అందించే ఎమర్జెన్సీ బ్లాకుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో రోగులు, డాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు.
తక్షణమే గాంధీలో నెలకొన్న దారుణ పరిస్థితులపై సమీక్షించి, చర్యలు తీసుకోనేలా ప్రభుత్వ వైద్య విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరిన న్యాయవాది రామారావు పిటిషన్ ను మానవ హక్కుల కేసు 4051/2025 గా నమోదు చేసి ఆగస్ట్ రెండో తారీఖున విచారణకు స్వీకరించింది. అక్టోబర్ 27 లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ కు నోటీసును ఇచ్చినట్లు అడ్వకేట్ రామారావు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
