బైకుల దొంగ దంపతులను పట్టించిన సీసీ టీవీ ఫుటేజీ
మద్యం, సిగరేట్లకు అలవాటై...బైక్ దొంతనాలు..
రూ.5లక్షల విలువ చేసే ఆరు బైకుల స్వాధీనం
సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజామంటలు) :
ప్రభుత్వ ఆసుపత్రులను టార్గెట్‌చేసుకుంటూ వరుసగా బైక్ దొంగతనాలు చేస్తున్న ఇద్దరు దొంగ దంపతులను చిలకలగూడ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.ఐదు లక్షల విలువ చేసే ఆరు ద్వి చక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు మండలానికి చెందిన కొటగిరి వినోద్ (30), అతని భార్య పావని (19)లు మద్యం, సిగరెట్ అలవాట్లకు డబ్బు కోసం బైక్ దొంగతనాలు చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రి సహా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పార్క్ చేసిన బైక్‌లను అపహరిస్తూ వచ్చారు. ఆగస్టు 20న గాంధీ ఆసుపత్రి పార్కింగ్‌లో నిలిపిన బైక్‌దొంగతనంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఆధారాలతో వారిని గుర్తించారు.సెప్టెంబర్ 3న ఉదయం చిలకలగూడ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి గాంధీలో దొంగిలించిన నాలుగు బైక్‌లు, భువనగిరి టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో రెండు బైక్‌లు సహా మొత్తం ఆరు బైక్‌లు (విలువ రూ.5 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ బీ. బాలస్వామి, అదనపు డీసీపీ జె. నర్సయ్య, ఏసీపీ కే. శశాంక్‌రెడ్డి నేతృత్వంలో చిలకలగూడ పోలీసులు విజయవంతంగా నిర్వహించారు. కేసును చేధించిన సీఐ అనుదీప్,డీఐ రమేశ్ గౌడ్,ఎస్.ఐ రాకేశ్ లను అభినందించి, రివార్డులను అందచేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శిశువు కడుపు నుండి ఇద్దరు పరాన్నజీవి కవలల తొలగింపు

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ అశోక్ కుమార్

జైలు నుంచి ఖైదీల పరారీ
.jpg)
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్

గురువుల రుణం తీర్చుకోలేనిది - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
