కనిపెంచితే చివరికి చావే దిక్కా...! పేరేంట్స్ ఆశలను అడియాసాలు చేసిన కూతురు
కూతురు చేసిన పనికి బాధతో తండ్రి బలవన్మరణం
రాంగోపాల్ పేట లో విషాద ఘటన
సికింద్రాబాద్ ఆగస్ట్ 08 (ప్రజామంటలు) :
ఒక్కగానొక్క కూతురును అల్లారు ముద్దుగా పెంచితే, తల్లిదండ్రుల ఆశలను అడియాసాలు చేస్తూ వేరే వ్యక్తితో వెళ్ళిపోయిన కూతురు చేసిన నిర్వాకానికి తీవ్ర మనస్థాపంతో ఓ తండ్రి బలయ్యాడు. రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబందించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. వెంగళరావునగర్ కు చెందిన జంగిటి రామస్వామి (50) ఆటో నడుపుతూ కుటుంబపోషణ చేస్తున్నాడు. భార్య లక్ష్మీ సికింద్రాబాద్ బుద్దభవన్ లోని జీహెచ్ఎమ్సీ కార్యాలయంలో స్వీపర్ గా పనిచేస్తోంది. గత నెల 30 తారీఖున కూతురు ఇంట్లోనుంచి ఎటో వెళ్ళిపోయింది. తెలిసిన అన్ని చోట్ల వెతికినప్పటికీ ఆచూకీ దొరక్కపోవడంతో తండ్రి రామస్వామి రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే సదరు యువతి ఓ పెండ్లైన యువకుడితో వెళ్ళిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. దాంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఓ వైపు కంటికి రెప్పలా పెంచిన కూతురు తమను విడిచివెళ్ళిపోయిందనే బాధ మరో వైపు చుట్టుపక్కల వాళ్ళు కూతురు గురించి పలు రకాలుగా సూటిపోటి మాటలు మాట్లాడుతుండటంతో రామస్వామి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. బుధవారం రాత్రి ఇంట్లో అంతా కలసి భోజనం చేసి గదిలోకి వెళ్ళి నిద్రపోయారు. తెల్లవారి భర్తను నిద్రలేపేందుకు భార్య లక్ష్మీ వెళ్ళి చూడగా, అతడు ఫ్యాన్ కు ఉరివేసుకొని వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు.
భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. కూతురు చేసిన పనికి తండ్రి ప్రాణం పోయిందని బాధను వ్యక్తం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
