వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.

On
వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

నల్లగొండ 25 జూలై (ప్రజా మంటలు) : 

జీవితాన్ని ఒక లక్ష్యంగా మలచుకుని, అందరిలో స్ఫూర్తి నింపడం కొద్దిమందికే సాధ్యమవుతుంది. అలాంటి అరుదైన వ్యక్తిత్వం కలిగినవారు డాక్టర్ యలమంచి రామకృష్ణ.

  • ఆయన ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం ఒక మారుమూల గ్రామం వెనికిరాలలో జన్మించి ఎంతో మందికి మార్గం చూపిన జీవతగాథ.
  • ఆయన భారత వాయుసేనలో 23 సంవత్సరాలు సేవ చేసిన ఈ అధికారి, పదవీ విరమణ తరువాత తన జీవితాన్ని వ్యక్తిత్వ వికాసానికి మరియు విద్యాభివృద్ధికి అంకితం చేశారు.

వాయుసేనలో నిస్వార్థ సేవ :  

  • రామకృష్ణ 1994 నుండి 2017 వరకు భారత వాయుసేనలో వారెంట్ ఆఫీసర్‌గా వాయుసేన ప్రధాన కార్యాలయం, న్యూఢిల్లీలో బాధ్యతలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న 130 కి పైగా ఎయిర్ ఫోర్స్ పాఠశాలలు మరియు 98 కేంద్రీయ విద్యాలయాల విద్యా పరిపాలనాధికారిగా సమర్థవంతంగా తన భాద్యతలను నిర్వర్తించారు.
  • సుమారు 52,000 మంది విద్యార్థులకు, 5000 మంది ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేసి, విద్యా రంగంలో కొత్త శకానికి నాంది పలికారు.

IMG-20250630-WA0039

పదవీ విరమణ తర్వాత విద్యా రంగంలో వెలుగులు నింపే ప్రయత్నం : 

  • 2017లో వాయుసేన నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత, డాక్టర్ రామకృష్ణ సామాన్య ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.
  • హైదరాబాద్‌లోని నాచారంలో నివసిస్తూ, ప్రస్తుతం రెండు శిక్షణ సంస్థలను నెలకొల్పి వ్యవస్థాపకుడిగా, నిర్దేశకుడిగా వ్యవహరిస్తున్నారు.
  • దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులకు లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ శిక్షణలతో 150000 లక్షల మందికి పైగా జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు.

అధ్యయనం, రచన, ప్రేరణ: త్రివేణి సంగమం

  • ఇప్పటివరకు 5 పుస్తకాలను రచించిన రామకృష్ణ, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
  • ఆయన వ్యాసాలు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ మ్యాగజైన్లలో ప్రచురితమై, పలు అవార్డులను అందుకున్నారు.

IMG-20250725-WA0008

శిక్షణా ప్రస్థానానికి ప్రతిబింబం : 

  • డాక్టర్ రామకృష్ణ అనేక ప్రఖ్యాత సంస్థల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.
  • ఐఐటీ గాంధీనగర్, లారస్ ల్యాబ్స్, ఎంఆర్ఎఫ్, సాండ్‌విక్, హెరిటేజ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, నిర్మాణ జాతీయ అకాడమీ, లోయోలా అకాడమీ, TSRTC, వ్యవసాయ శాఖ, ఎయిర్ ఫోర్స్ పాఠశాలలు వంటి పలు సంస్థల్లో కార్పొరేట్ శిక్షణలు అందిస్తూ, జీవిత నైపుణ్యాల పరంగా ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచారు.
  • కొన్ని జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలతో భాగస్వామ్యంగా, దేశవ్యాప్తంగా ఉన్న 1,00,000 మందికి పైగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.
  • దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో శిక్షణలు అందిస్తూ, వేలాది విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపుతూ వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నారు.

ప్రామాణికతలు : 

డాక్టర్ రామకృష్ణ నాబెట్ నుండి సర్టిఫైడ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా, అమెరికా సంస్థల ద్వారా ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ మరియు ఎగ్జిక్యూటివ్ లైఫ్ కోచ్గా గుర్తింపు పొందారు.

సమాజ సేవ : 

  • వృత్తిపరమైన విజయాలతో పాటు, డాక్టర్ రామకృష్ణ సామాజ సేవలోనూ ముందున్నారు.
  • ఆర్థికంగా బలహీన వర్గాల జీవితాన్ని మెరుగుపరిచేందుకు ఆయన పలు కార్యక్రమాలు చేపట్టారు.
  • నిత్యావసర వస్తువుల విరాళం, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు విద్యా సహాయం, ఆహార పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా ఆయన అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

అవార్డులు,పురస్కారాలు : 

  • హానరరీ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ హ్యూమానిటీ), 2019
  • సేవా రత్న అవార్డు – 2019
  • ఇండియన్ గ్లోరీ అవార్డు, 2019
  • ఉగాది నంది అవార్డు (2023)
  • ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు (2025)
  • వాయుసేన నుండి లాంగ్ సర్వీస్ మెడల్, సైన్య సేవా మెడల్.

IMG-20250725-WA0007

మాటల ద్వారా మార్పు : 

  • " మాటల్లో మార్పు ఉంది. మార్పుతో ఎదుగుదల ఉంది" అనే నినాదంతో, ఆయన ప్రసంగాలు విన్న ప్రతివారు ఒక మెట్టు పైకి ఎక్కుతున్నారు.
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఒడిషా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఆయన వాణి మార్గదర్శకంగా నిలుస్తోంది.

వ్యక్తిగత వివరాలు : 

  • తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలపై డాక్టర్ రామకృష్ణకు పూర్తి పట్టు ఉంది.
  • హైదరాబాద్‌లో నివసిస్తూ దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు.
  • ఎప్పటికీ నేర్చుకుంటూ, నేర్పిస్తూ, మార్పుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.

సంక్షిప్తంగా : 

  • డాక్టర్ యెలమంచి రామకృష్ణ — ఒక సైనికుడిగా ప్రారంభమై, లక్షల మందికి జీవిత మార్గదర్శిగా మారిన శిక్షకుడు, రచయిత, ప్రేరణాత్మక నిర్దేశకుడు.

యూట్యూబ్ ఛానల్ – Redefine Life with Dr RK

ఫోన్ నంబర్: 9958361110

ఇమెయిల్: drramakrishna02@gmail.com.

IMG-20250725-WA0004

Tags

More News...

Local News 

భరోసా సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భరోసా సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా: జిల్లా ఎస్పి అశోక్ కుమార్ జగిత్యాల జులై 26 (ప్రజా మంటలు) లైంగిక వేధింపులు, గృహహింసకు, అత్యాచారo కు  గురైన బాధితులకు న్యాయ, వైద్య, మరియు సైకాలజికల్ సపోర్టు వంటి సేవలు  ఒకే దగ్గర అందించాలన్న సంకల్పంతో భరోసా కేంద్రాని  ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో భరోసా...
Read More...
Local News 

కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో అమరులైన వారికి ఘన నివాళులు

కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో అమరులైన వారికి ఘన నివాళులు జగిత్యాల జులై 26 ( ప్రజా మంటలు) కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని కార్గిల్ విజయ్ దివస్‌ను గురువారం జగిత్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించి యుద్ధంలో అమరులైన వారికి నివాళులు అర్పించారు. నాయకులు  ఏసీఎస్ రాజు, పుప్పాల సత్యనారాయణ కాశీ నాదం మాట్లాడుతూ కార్గిల్ విజయ్ దివస్‌ 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని...
Read More...
Local News 

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం,

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం, ఇబ్రహీంపట్నం జులై 26 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )  ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన నేరెళ్ల సుభాష్ గౌడ్ జగిత్యాల జిల్లా ఐ జే యు 143 ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా డబ్బా గ్రామంలో మాజీ సర్పంచ్ పుప్పాల నర్సయ్య, కాంగ్రెస్ యువ నాయకులు దేశెట్టి జీవన్, డబ్బా విడిసి చైర్మన్ జాన...
Read More...
Local News 

హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు

హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు   జగిత్యాల జులై 25( ప్రజా మంటలు)    జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ప్రతి ఏట నిర్వహిస్తున్నట్లుగా శుక్రవారం శ్రావణమాసం అభిషేక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి .వైదిక క్రతువులు అన్యారంభట్ల మృత్యుంజయ శర్మ .జన్మంచి సత్యనారాయణ తదితరులు నిర్వహించారు. ఉదయము స్వామివారి మూలవిరాట్ కు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గణపతి ఉపనిషత్తులు. నారాయణ ఉపనిషత్తు . మన్యుసూక్తము,...
Read More...
Local News 

మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ - రెండు వందల కార్లు , బస్సులతో హైదరాబాద్ నుంచి వేములవాడకు

మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ  - రెండు వందల కార్లు , బస్సులతో హైదరాబాద్ నుంచి వేములవాడకు వేములవాడ అమ్మవార్లకు బోనాలు -ప్రముఖ మెజీషియన్ సామల వేణు    సికింద్రాబాద్  జూలై 25 (ప్రజా మంటలు):: :బీసీల ఐక్యత బలంగా ఉండడానికి తెలంగాణ మున్నూరుకాపు సంఘాల ఆధ్వర్యంలో భారీగా కార్లు,బస్సుల ర్యాలీగా వెళ్ళి వేములవాడ అమ్మవార్లకు బోనాలు సమర్పించనున్నట్లు ప్రముఖ మెజిషీయన్, మున్నూరు కాపు రాష్ర్ట నాయకులు  సామల వేణు అన్నారు. తెలంగాణ మున్నూరు...
Read More...
Local News 

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల జులై 25 ( ప్రజా మంటలు) పట్టణ 23 24 25 వార్డులలో 30 లక్షల నిధులతో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  మాట్లాడుతూ.... పచ్చదనం పరిశుభ్రత లో జగిత్యాల పట్టణం దేశానికి ఆదర్శంగా ఉండేలా చూడాలనీ జగిత్యాల పట్టణం అభివృద్ధికి నిరంతరం కృషి...
Read More...
Filmi News  State News 

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు  *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు 

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు  *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు  సికింద్రాబాద్, జూలై 25 ( ప్రజామంటలు): ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్  సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జనసేన నాయకులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గబ్బర్ సింగ్ టీం,జనసేన పార్టీ నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు...
Read More...
Local News 

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

 విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన గొల్లపల్లి జూలై 25 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం కేంద్రంలో తెలంగాణ మోడల్ స్కూల్లో జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు నషా ముక్త భారత్ అభియాన్ లో భాగంగా విద్యార్థుల్లో మత్తు పదార్థాల దుర్వినియోగము,అక్రమ రవాణా అడ్డుకట్ట పట్ల సమాజంలో, విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి నృత్య ప్రదర్శన ఇచ్చారు. మత్తు పదార్థాల దుర్వినియోగం ద్వారా...
Read More...
Local News 

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్ జగిత్యాల జులై 25 (ప్రజా మంటలు)జగిత్యాల మున్సిపల్  డి ఈ గా నూతనంగా భాద్యతలు చేపట్టిన ఆనంద్ కుమార్  జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన ఏ ఈ శరన్ తదితరులు ఉన్నారు.
Read More...
Local News 

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి జగిత్యాల జిల్లా 25 (ప్రజా మంటలు) జిల్లాలో నూతనంగా మంజూరైన తెల్ల రేషన్ కార్డులను లబ్ది దారులకు పంపిణీ చేసిన  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  రాష్ట్ర వ్యాప్తంగా జూలై 25 నుండి ఆగస్టు 10 వరకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ మండల కేంద్రాల్లో కొనసాగుతుందని రాష్ట్ర సంక్షేమ...
Read More...

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్ 

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్    గొల్లపల్లి జూలై,25 (ప్రజా మంటలు): వెల్గటూర్ మండలం కోటిలంగాల శ్రీ పార్వతి కోటేశ్వరస్వామి ఆలయ కమిటీ చెర్మన్ గా పుదారి రమేష్ కు నియామకపు పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్సి, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  చేతుల మీదుగా  అందజేశారు  నాపై నమ్మకం తో నియామకానికి సహకరించిన, రాష్ట్ర ఎస్సి,...
Read More...
Local News 

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ జగిత్యాల జులై 25 (ప్రజా మంటలు)శాంతి భద్రతల పరిరక్షణకు గస్తీని మరింత ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బ్లూ కోల్డ్స్, పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహిస్తూ అదనంగా నైట్ బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. గురువారం...
Read More...