ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు
సికింద్రాబాద్, జూలై 25 ( ప్రజామంటలు):
ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్ సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జనసేన నాయకులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గబ్బర్ సింగ్ టీం,జనసేన పార్టీ నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.టిటిడి బోర్డు సభ్యుడు,జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ జనసేన అధ్యక్షులు రాదారం రాజలింగం,కూకట్పల్లి నియోజకవర్గం ఇన్చార్జి ప్రేమ్ కుమార్ లు తోటి నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వారిని ఆలయ పూజారులు ఆశీర్వదించి సన్మానించారు.తదనంతరం ఆలయం ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మా దైవం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని... హరిహర వీరమల్లు సినిమా విజయవంతమైనందుకు పవన్ కళ్యాణ్ గోత్రం, పేరుతో అర్చన చేపించి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. అతి త్వరలో పవన్ కళ్యాణ్ కూడా శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వచ్చి అమ్మవారి దీవెనలు తీసుకుంటారని చెప్పారు.
కొందరు ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారని...ఒక సినిమాని సినిమా లాగానే చూడాలి గాని కొందరు పనిగట్టుకుని విమర్శిస్తున్నారని అది తగ్గదన్నారు.త్వరలో దేశంలో ఆక్టివ్ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ ఉంటారని ఈ సందర్భంగా వారు అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వీర మహిళ చైర్మన్ మండపాక కావ్య, జనసేన నాయకులు దామోదర్ రెడ్డి,సురేష్ రెడ్డి, వీర్ల రమేష్, గబ్బర్ సింగ్ టీం సాయిబాబా,రమేష్, రేన్షన్ రాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో అమరులైన వారికి ఘన నివాళులు

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం,

హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు

మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ - రెండు వందల కార్లు , బస్సులతో హైదరాబాద్ నుంచి వేములవాడకు

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ
