ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నాం -ఎమ్మెల్సీ కవిత
ఆర్డినెన్సు పై బిజెపి స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదు - కవిత
హైదరాబాద్ ఆగస్ట్ 03:
బీసీ రిజర్వేషన్ ల సాధన కై తెలంగాణ జాగృతి 72 గంటల పాటు రేపటి నుంచి మూడు రోజులు నిరాహార దీక్ష చేస్తున్నాం. ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు.
బీసీల్లో 112 కులాలు ఉన్నాయి. తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి రోజు 40 కులాలు మాట్లాడే అవకాశం ఉంటుంది.అన్ని కులాలు తమ సమస్యలు చెప్పుకునేందుకు కనీసం మూడు రోజులు పడుతుంది.అందుకే తెలంగాణ జాగృతి 72 గంటల పాటు నిరాహార దీక్షకు సిద్ధమవుతుందని ఆమె అన్నారు.
గాంధేయ మార్గంలో అన్నం తినకుండా , నీళ్లు తాగకుండా 72 గంటలు దీక్ష చేస్తున్నాము.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్, బిజెపి కలిసి నాటకాలు ఆడుతున్నాయి.
ఆర్డినెన్సు పై బిజెపి స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదు - కవిత
బిసి రిజర్వేషన్ల పై బిజెపి ధర్నా కామెడీ ధర్నాలా ఉన్నది, దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ఉన్నది.
తెలంగాణ ఆడ బిడ్డను నేను నా పైన కొందరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర ప్రజలందరూ స్పందించారు.బిఆర్ఎస్ పార్టీ మాత్రం స్పందించలేదు.
నా పై మరుగుజ్జుల వ్యాఖ్యలకు భయపడను
నా పైన కొందరు చేస్తున్న వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ లో ఒక పెద్ద నేత హస్తం ఉన్నది .. అందుకే నా పైన కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు.
నేను భయపడే వ్యక్తిని కాదు , తెలంగాణ కోసమే కొట్లాడిన. బిఆర్ఎస్ పార్టీలో లిల్లీపుట్ నాయకుడు ఉన్నాడు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ కి ఆ నాయకుడి వల్లనే నష్టం జరిగింది
కేసీఆర్ లేకపోతే, ఆయన లేడు... పార్టీ లో ఇంకెవరూ లేరునా పైన ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు.నేను కేసీఆర్ కు రాసిన లేఖ ఏ విధంగా బహిర్గతం అయింది నాకు తెలుసు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ సర్వ నాశనం కావడానికి ఆయనే కారణం.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం ఆయనే.
ఆయన గెలుపు చావు తప్పి కన్నులొట్ట పోయినట్లు ఉన్నది.లిల్లీపుట్ నాయకుడు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.సీఎం రమేష్ ఎందుకు వ్యాఖ్యలు చేశారో నాకు తెలియదు.
నాకు ఎవరి సపోర్ట్ లేదు మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్లకే అలవాటు. మేం తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లం.. మా పై కొందరు కొత్తగా వచ్చిన వాళ్లు మాట్లాడటం విడ్డురంగా ఉంది.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వాళ్లు
పార్టీలోకి వచ్చి పదవులు పొందారు
అలాంటి వాళ్ళ వల్లనే బీఆర్ఎస్ కు నష్టం జరిగింది.. తెలంగాణ ఉద్యమకారులు ఇబ్బంది పడ్డారు. బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ
పార్లమెంట్ లో మాట్లాడలేదు
రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ అడిగితే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వరా. రేపటి నుంచి మేము చేస్తున్న దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం
More News...
<%- node_title %>
<%- node_title %>
మిత్రుల కలయిక తోనే ప్రశాంతత మానసిక ఉల్లాసం..ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కాళేశ్వరం కమీషన్ నివేదికపై కేసీఆర్ సమాలోచనలు

ఆగస్టు 6న ధర్మపురిలో జరిగే వికలాంగుల దివ్యాంగుల మహాసభ విజయవంతం చేయండి-ఉమ్మడి జిల్లా ఇన్చార్జి VHPS జాతీయ అధ్యక్షులు గోపాల్

ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, అధ్వర్యంలో అంబేద్కర్ స్మరణ పాల్గొన్న ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి సంపూర్ణ చారి

సిఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ

గంజాయి పెంచుతున్న వారిపై పోలీసుల నజర్ యువకుడి పట్టివేత

జగిత్యాల వివిధ సత్సంగాలచే బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఘనంగా భజన కార్యక్రమం.

శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

అనాధలకు దుప్పట్లు, దుస్తులు, ఔషధాలు పంపిణి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నాం -ఎమ్మెల్సీ కవిత

త్వరలో డయాగ్నిస్టిక్ నమూనాల సేకరణపై కనిస ప్రమాణాల నిర్ణయం
