అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఆగస్టు1( ప్రజా మంటలు)
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఎస్పి అన్నారు.
ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం కోసం ఒక్కో సబ్ డివిజన్ పరిధిలో ఒక సబ్- ఇన్స్ పెక్టర్, ముగ్గురు కానిస్టేబుల్స్,ఒక మహిళ కానిస్టేబుల్ ను ప్రత్యేకంగా కేటాయించి చైల్డ్ లైన్ తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందనీ ఎస్పీ అన్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం జులై 1 నుండి 31వరకు ఆపరేషన్ ముస్కాన్-XI కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది ఇందులో 36 మంది బాలకార్మికులను గుర్తించి CWC (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) ముందు హాజరుపరచడం జరిగింది.
ఈ సందర్బంగాఎస్పీ మాట్లాడుతూ ... బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదని, బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు.తప్పిపోయిన వదిలివేయబడిన బాలల సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100 కి కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వగలరు అని తెలిపారు. బాలకార్మికులుగా పెట్టుకున్న వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
పోలీసు శాఖతో కలిసి ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం చేయడంలో కృషి చేసిన వివిధ శాఖల అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
