కాళేశ్వరం కమీషన్ నివేదికపై కేసీఆర్ సమాలోచనలు
స్థానిక సంస్థల ఎన్నికల పై చర్చ - కవిత వ్యవహారంలో ఆచితూచి నిర్ణయం
కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి ట్వీట్
హైదరాబాద్ ఆగస్ట్ 03:
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వరుస భేటీలలో భాగంగా, ఇవాళ మరోసారి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, నిజామాబాద్ జిల్లా నాయకులతో మంతనాలు జరుపుతున్నారు.
కాళేశ్వరం కమీషన్ ఇచిన నివేదిక, స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. ఎరవెల్లి నుండి కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు ర్యాలీగా వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
అలాగే, కాళేశ్వరం వల్ల కలిగిన లాభాలను ప్రజలకు తెలియ చెప్పడానికి, త్వరలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కూడా ఆలోచించారని, ప్రభుత్వం రేపటి క్యాబినెట్ లో తీసుకొనే నిర్ణయంపై ఆధారపడి, కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు భావిస్తున్నారు.
వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కేటీఆర్ గత మూడు రోజులుగా ఫామ్ హౌస్ లో ఉండి, భవిష్యత్ కార్యక్రమాల గురించి, కేసీఆర్ తో చేర్చినట్లు తెలుస్తుంది.
ఈ మీటింగ్ లో హరీశ్ రావు, కేటీఆర్,మెటుపల్లి ఎమ్మెల్యే సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఈ భేటీలో మిగతా విషయాలతో పాటు, తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితిపై చర్చిస్తున్నట్లు సమాచారం.
కవిత - తెలంగాణ జాగృతి వ్యవహారశైలిపై ప్రస్తుతానికి మౌనంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నట్లు, ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరగనట్లు తెలుస్తుంది.
కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి ట్వీట్.jpg)
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్తో ముఖ్య నేతల భేటీపై ప్రాధాన్యత ఏర్పడింది. మాజీ మంత్రి జగదీశ్రడ్డిపై ఎమ్మెల్సీ కవిత పరోక్షంగా లిల్లీపుట్ నాయకుడు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. 'నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు... కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణలు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లే వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్న' అంటూ రాధాకృష్ణలు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లే వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్న' అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే, కవిత అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్ ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు

72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత

గాంధీలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఇది బీసీల ఆత్మగౌరవ పోరాటం - 42% బిసి బిల్లు ఆమోదించాలని దీక్ష - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత
