ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
(రామ కిష్టయ్య సంగన భట్ల)
సనాతన సాంప్రదాయాల వారసత్వ నేపథ్యం కలిగిన ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురిలో నిర్వహిస్తున్న శ్రావణ మాసోత్సవాల నేపథ్యంలో, శుక్రవారం సందర్భంగా అత్యధిక సంఖ్యాకులైన భక్తులు, యాత్రికులు గోదావరి స్నానాలకై తరలి వచ్చారు. ఇటీవలి కాలంలో భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో, శ్రావణ మాసపు శుక్రవారం పర్వదినం నాడు ఉదయాత్పూర్వం నుండే పిల్లాపాపలతో, గోదావరి నదిలో మంగళ స్నానాలు ఆచరించి, మహా సంకల్పాది పూజ నుంచి, గోదావరి మాతను అర్చించారు. జీవనదియైన గోదావరి తమను ఎల్ల వేళలా కరుణించి, కాపాడాలని భక్తి ప్రపత్తులతో అర్ధించారు.
పర్వకాలంలో మహిళలు పెద్ద సంఖ్యలో ముత్తయిదువులకు వాయినాలను సమర్పించు కున్నారు. మహా సంకల్పం, దాన ధర్మాది సత్కర్మలను ఆచరించారు. అధిక భక్తులు సనాతన ఆచారంలో భాగంగా గోదావరి తీరంలో కోడి, మేకల లాంటి జంతు బలులతో, మొక్కులు తీర్చుకున్నారు. నది వద్ద వంటలు చేసుకుని మాతకు నైవేద్యాలు సమర్పించి భుజించారు. గోదావరి పౌరోహితుల ఆధ్వర్యంలో తమ గోత్ర నామాదులతో ప్రత్యేక పూజలు, మహా సంకల్పాదులను వేదోక్త సాంప్రదాయాచరణ ప్రకారం ఆచరించారు.
అనంతరం దైవ దర్శనాల కొరకు ప్రధానాలయాలకు వెళ్లి , దైవ దర్శనాలు చేసుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానంలోని ప్రధానాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు గావించారు.
శ్రీ వేంకటేశ్వర ఆలయంలో లక్ష్మీహెూమాలను, లక్ష్మీ సూక్త హవనాలను, శ్రీ వేంకటేశ్వర, యోగానంద, ఉగ్ర నరసింహ ఆలయాలలో మహా క్షీరాభిషేకాలు నిర్వహించారు. దేవస్థానం ఎసి, ఈఓ శ్రీనివాస్, జక్కు రవీందర్ నేతృత్వం లోని ధర్మ కర్తల ఆద్వర్యంలో, వేదపండితులు, వివిధ ఆలయాల అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక సాంప్రదాయక కార్యక్రమాలను నిర్వహించారు.

శ్రీసంతోషి మాత ఆలయంలో సంతోషిమాత వ్రత కార్యక్ర మాలలో పాల్గొన్నారు. క్షేత్రంలోని శ్రీ యోగానంద ఉగ్ర నారసింహ, శ్రీ వేంకటేశ్వర, ఆంజనేయ, శ్రీరామలింగేశ్వర, అక్కపెల్లి రాజేశ్వర ఆలయాలలో, వాడవాడలలోగల శివ పంచాయతనాల యందు సంప్రదాయం వేదోక్త రీతిలో కన్నుల పండువగా, భక్తి ప్రపత్తులతో ప్రత్యేక పూజలు అర్చనలు గావించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
