అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్
పదేళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల కల నెరవేరింది.
(అంకం భూమయ్య)
గొల్లపల్లి జూలై 31 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఫంక్షన్ హాల్లో గురువారం రోజున నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొని గొల్లపల్లి మండలానికి మంజూరు అయిన 1658 కొత్త తెల్ల రేషన్ కార్డులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అనంతరం 67 కళ్యాణ లక్ష్మీ చెక్కులను,18 లక్షల 41వేల రూపాయల 65 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.
ప్రతి నియోజకవర్గంలోని మండల పరిధిలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిర్వహించాలని,అలానే రేషన్ కార్డు రాని వారు కంగారు పడాల్సిన పని లేదని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, కార్డు రాని వారు మీసేవాలో కానీ.. లేదంటే ప్రజా పాలనలో మరో సారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో దాదాపు 10 సంవత్సరాల తర్వాత.. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ కార్డులో కొత్త పేర్లను కూడా కలిపేందుకు అవకాశం కల్పించామని తెలిపారు.
వాటన్నింటిని పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి మళ్లీ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అందని కార్డులు ఇప్పుడు వారి చేతుల్లోకి రానుండటంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారనీ,రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ దిశగా చేసిన మరో గొప్ప అడుగు అని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్,డిఎస్ఓ జితేందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ భీమసంతోష్, వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి,తహసిల్దార్ కటకం వరంధన్ ,ఎంపీడీవో రాంరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు కొక్కుల జలంధర్, రాపల్లి గంగన్న, జెల్లా అనిల్, రంగు శ్రీనివాస్ గౌడ్, నక్క గంగరాజం, రాజేశ్వర్ ,అధికారులు,ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక
.jpeg)
BC రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికం - పల్లె వినయ్

ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్
