BC రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికం - పల్లె వినయ్
రేపు (ఆగస్ట్ 2న) సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్ ఆగస్ట్ 01:
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం వివిధ సామాజిక శక్తులు మరియు టి.జె.ఎస్ పార్టీ చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ఈ రిజర్వేషన్లు సాధించగలిగామని, ఇప్పుడు వాటికి చట్టబద్ధమైన రక్షణ కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని టి.జె.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్ కుమార్ తెలిపారు.
ఈ రోజు టి.జె.ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ శాసనసభ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ఆమోదించి, తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రేపు (ఆగస్ట్ 2న) సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం
అదేవిధంగా, *రేపు (02-08-2025) ఉదయం 10 గంటల నుండి, హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో “బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు – కేంద్ర ప్రభుత్వ వైఖరి” పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని టి.జె.ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.*
కేంద్రం బిసి రిజర్వేషన్ల బిల్లు ఆమోదంలో జాప్యం చేయడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్యంలో బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో సమగ్ర హక్కులు అందించాలంటే రిజర్వేషన్లు అత్యంత కీలకమని తెలిపారు. ఈ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ వాదన అసంబద్ధమని, ద్వంద వైఖరి ప్రదర్శిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడాన్ని విమర్శించారు.
రేపు జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సంఘాల నేతలు, మేధావులు, పౌరసంఘాల ప్రతినిధులు పాల్గొని, బీసీలకు న్యాయమైన రిజర్వేషన్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన విధానాలపై చర్చ జరగనుందని తెలిపారు.
ఈ సమావేశంలో టి.జె.ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస, ప్రధాన కార్యదర్శులు నిజ్జన రమేష్, గోపగాని శంకర్ రావు, బీసీ సెల్ కన్వీనర్ జశ్వంత్ కుమార్, హైదరాబాద్ నగర అధ్యక్షుడు ఎం. నరసయ్య, భద్రాద్రి ఆంజనేయులు, ఆకుల శ్రీనివాస్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
