జిల్లా కేంద్రంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.
జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)
శనివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలో మన గ్రోమోర్ దుకాణంలో ఎరువుల సరఫరా పై జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ ఎరువుల విక్రయాలకు సంబంధించినన రికార్డులను పరిశీలించారు. ఎరువుల దుకాణం ముందు సూచిక బోర్డు తప్పనిసరి ఉంచాలని, సూచిక బోర్డుపై ఎరువులు మందులు మరియు విత్తనాలు ధరల పట్టిక లో ధరలు రాయాలని,
రైతులకు సరైన ధరలకు అమ్మాలని సూచించారు.
అదే విధంగా రైతులకు ఎరువులు విత్తనాలు నాణ్యతమైనవి అందించాలని, కాలం చెల్లిన ( ఎక్స్ పైర్ ) మందులను రైతులకు అమ్మ రాదని పేర్కొన్నారు. ఎరువులు మరియు స్ప్రే మందులు సరైన ధరలకు అమ్మాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులతో ఒక ఎకరానికి ఎంత ఎరువులు వేస్తున్నారని రైతులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత మైన మందులు ఇస్తున్నారా. అడిగి తెలుసుకున్నారు. దుకాణదారు యజమానులకు రైతులకు నాణ్యతలేని ఎరువులు మందులు విత్తనాలు అమ్మినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్, మండల అధికారి ఏవో వినీల మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా కేంద్రంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

బీసీలకు 42%రిజర్వేషన్లపై జన సమితి రౌండ్ టేబుల్ సమావేశం

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి
