ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి
మెట్పల్లి ఆగస్టు 1 (ప్రజా మంటలు)
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి, చెరుకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, గురిజెల రాజారెడ్డిలు ఎస్సారెస్పీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
మెట్ పల్లిలో శుక్రవారంనాడు విలేకరులతో వారు మాట్లాడుతూ ఎస్సారెస్పీ కెనాల్ కింద ఆయకట్టు రైతులు వానాకాలం వరి పంట సాగు నిమిత్తం వరి నార్లు పోసి 20 రోజుల నుండి దాదాపుగా 35 రోజులు కాల వ్యవధి కావస్తున్నప్పటికీ కెనాల్ నీటిని విడుదల చేయకపోవడంతో వరి నాట్లు వేయలేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ వరి నార్లు ముదిరిపోతాయనే కారణంతో మానసిక ఆవేదనకు గురవుతున్నారనీ పేర్కొన్నారు.
వరి నాట్లను సకాలంలో వేయకపోతే వరి పంట దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉందని తెలిపారు. వానకాలం సీజన్ వ్యవసాయ సాగు పంటలకు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పొలాల్లో వరి నాట్లు వేసుకునేందుకు ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి, చెరుకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, గురిజెల రాజారెడ్డిలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రైతు నాయకులు కొత్తపల్లి రాజారెడ్డి,ఇట్టెడి శంకర్ రెడ్డి,వొడ్డెం వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
