ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, అధ్వర్యంలో అంబేద్కర్ స్మరణ పాల్గొన్న ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి సంపూర్ణ చారి
జగిత్యాల ఆగస్టు 3 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్యవర్గసభ్యుడు, డిక్కి జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మరణ కార్యక్రమం ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి అతిథులుగా పాల్గొని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలతో నివాళులు అర్పించి సేవలను స్మరించారు.
అంబేద్కర్ దేశానికి అందించిన అమూల్యమైన సేవలు, సమానత్వం, న్యాయం సామాజిక సంస్కరణలో వారి ఆలోచనలు, ఆశయాలను, ఆదర్శల ద్వారా భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందటంతో పాటు స్మరించుకోవాలని కార్యక్రమం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నామని నల్ల శ్యామ్ తెలిపారు.
ఈ సందర్బంగా అధ్యక్షులు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సంపూర్ణ చారి మాట్లాడుతూ..... ఈరోజు బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వామ్యం అవుతున్నారు అంటే అంబేద్కర్ చేసిన కృషి ద్వారానే సాధ్యమైందని అన్నారు.
వారి జీవితాన్ని త్యాగం చేసి అణగారిన, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడి రాజ్యాంగ బద్దంగా సాధించి చట్టరూపంలో కార్యరూపం సాధించుటకు అహర్నిశలు పాటుపడ్డారు.
ఆనాటి కాలంలో అంబేద్కర్ ఎదురుకున్న సంఘటనలను భవిష్యత్ తరాలకు మళ్ళీ రావద్దని రిజర్వేషన్స్ అనే రక్షణను, రాజ్య పదవులను రిజర్వేషన్స్ ప్రకారం కేటాయించి అందులో వారే పోటీ చేసి పరిపాలనలో భాగస్వామ్యం అయ్యేలా ఆలోచన చేసిన వారి మేధస్సు ఎలా సాధ్యమైందో అశ్చర్యం వేస్తుందన్నారు. విదేశాలకు వెళ్లి న్యాయశాస్త్రంలో పట్టాపొంది అట్టి జ్ఞానంతో దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పని చేసిన వారి సేవలు అనిర్వచనీయం అన్నారు
.ఆయన దూరదృష్టి వల్లనే ఈ రోజు బడుగు, బలహీన వర్గాలు పార్లమెంట్, శాసనసభ్యులు కాగలుగుతున్నారు అని స్మరించారు. ఇలాంటి కార్యక్రమం లో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు జిల్లాప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో నిర్వాహకులు నల్ల శ్యామ్, మద్దెల నారాయణ, మేనేని రవిందర్ రావు, రాజకుమార్, సిరిసిల్ల వేణుగోపాల్, రాజ్ కుమార్, మనోజ్, కాయితి శ్రీనివాస్, ఆనంతుల కాంతారావు , తక్కళ్ళ దేవయ్య, బొల్లం ప్రభాకర్, దాసరి లచ్చయ్య, కంటె అంజయ్య, దాసండ్ల కమలాకర్,జవ్వాజి శంకర్, చెటపెల్లి రాజనర్సు, నర్ర రాజేందర్, బుయ్య శాంతయ్య, మూగల జలందర్, బత్తుల రాజేందర్, శ్రీపతి మనోహర్, గుంటూరు నారాయణరెడ్డి, సుద్దాల జలాదిశ్వర అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్ ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు

72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత

గాంధీలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఇది బీసీల ఆత్మగౌరవ పోరాటం - 42% బిసి బిల్లు ఆమోదించాలని దీక్ష - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత
