అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం - రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సికింద్రాబాద్,ఆగస్ట్ 02 (ప్రజామంటలు):
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందుతుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ సీతాఫల్ మండి జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్ లో సికింద్రాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను శాసనసభ్యులు పద్మారావు గౌడ్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరిలతో కలసి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఉన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో 1803 కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని అలాగే కొత్తగా 11955 మంది లబ్ధిదారుల్లో పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇంకా3 వేల రేషన్ కార్డులు వెరిఫికేషన్ నడుస్తుందని, సికింద్రాబాద్ నియోజకవర్గంలో మొత్తం రేషన్ కార్డులు 47345 నుండి 49148 కి పెరిగాయని అన్నారు.అలాగే లబ్ధిదారుల సంఖ్య 156268 నుండి 168223 కి పెరిగాయని తెలిపారు.ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మహిళలు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు.
రేషన్ కార్డు బియ్యం తీసుకోవడమే కాదు ఇది ఒక గుర్తింపు అని అన్నారు.రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ లో బాగంగా 55 వేలకు పైగా రేషన్ కార్డులు హైదరాబాద్ లో ఇస్తున్నామని, రేషన్ కార్డులు వెరిఫికేషన్ నడుస్తుందని తెలిపారు.రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ... రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్నవారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు.దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ లో మాత్రమే సన్న బియ్యం ఇస్తున్నామని అన్నారు. రైతు పండించిన సన్న వడ్ల కి 500 బోనస్ ఇచ్చి వాటిని కొనుగోలు చేసి సన్న బియ్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గత వారమే 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయ్యాయి.
6800 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించిందని పేర్కొన్నారు.9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా విడుదల చేశామని..రైతులకు రుణమాఫీ పూర్తి చేశామని ఈ సందర్భంగా వివరించారు.హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచామని, 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇస్తున్నామని నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని అన్నారు. హైదరాబాద్ లో ఎలా కేటాయించాలని మార్గదర్శకాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఉపాధి దగ్గరే ఇల్లు ఇవ్వాలని పాలసీ తీసుకుంటున్నామని తెలిపారు.
నగరంలో శానిటేషన్ ,స్ట్రీట్ లైట్స్, రోడ్స్ ,ఫ్లై ఓవర్ లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రేషన్ కార్డులు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ జి ముకుంద రెడ్డి, ఆర్డిఓ సాయిరాం, డీఎస్ఓ శ్రీనివాస్,కాంగ్రెస్ ఇంచార్జీ ఆదం సంతోష్ కుమార్, కార్పొరేటర్లు సామల హేమ,శైలజ,సునీత,ప్రసన్న లక్ష్మీ,అనిల్ కుమార్,కరాటే రాజు,రాజేందర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

అనాధలకు దుప్పట్లు, దుస్తులు, ఔషధాలు పంపిణి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నాం -ఎమ్మెల్సీ కవిత

త్వరలో డయాగ్నిస్టిక్ నమూనాల సేకరణపై కనిస ప్రమాణాల నిర్ణయం

సృష్టి కేసులో పోలీస్ కస్టడికి మరో ఇద్దరు నిందితులు

శ్రీలత క్రియేషన్స్ బోటిక్ లో హునర్ ఆన్లైన్ కోర్సెస్ బ్రాంచి ప్రారంభించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత

వైద్య ఆరోగ్యశాఖ పదోన్నతులలో అవినీతి అక్రమాలు అవాస్తవం - రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వర్ రెడ్డి

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం - రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
.jpg)
ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్ట్

పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన.- మంత్రి శ్రీధర్ బాబు
