కాపులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
కాపునాడు తెలంగాణ అధ్యక్షుడు గంధం కరుణాకర్ నాయుడు
సికింద్రాబాద్, జూలై 06 (ప్రజా మంటలు):
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వెన్నంటూ ఉంటున్న కాపు,మున్నూరు కాపు సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని కాపునాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గంధం కరుణాకర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని ఏండ్లు గా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్న కాపు,ముస్నూరు కాపు సామాజిక వర్గానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో తీవ్ర అన్యాయం చేసిందని, కాపు సామాజిక వర్గం రాష్ట్రంలో 27% శాతం ఉన్నా పీసీసీలో గాని,నామినేటెడ్ పదవులులో గాని మంత్రి పదవి కానీ ఏ ఒక్క మున్నూరు కాపు.కాపు సామాజిక వర్గానికి పదవులు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబెట్టలేదని కరుణాకర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతర కుల సంఘాల సామాజిక వర్గాలకు న్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాపు సామాజిక వర్గంపై ఎందుకింత వివక్ష కట్టిందని ప్రభుత్వ పెద్దలను సూటిగా ప్రశ్నించారు. కాపు,మున్నూరు కాపులపై చిన్న సూపు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎలక్షన్లలో తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు.ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వెంటే ఉండి గత ప్రభుత్వం కాపు కులస్తులను ఎన్ని ఇబ్బందులు పెట్టిన వారు కాంగ్రెస్ పార్టీ జెండాను వదిలి పెట్టలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ కు అండగా ఉన్న కాపు,మున్నూరు కాపులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాపులను పక్కకు పెట్టడం విడ్డూరంగా ఉందని ఎదవ చేశారు.. రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాపుల అండ తప్పనిసరి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మున్నూరు కాపులను కాపులను గుర్తించి మా కాపులకు సరియైన న్యాయం చెయ్యకుంటే కాపు కులస్తుల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు.
రాజీవ్ యువ వికాసం పథకం లో కాపులకు ఆప్షన్ ఇవ్వకుండా కాపు కులస్తులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని కాపు యువత ఆవేదన వ్యక్తం చేశారు. కాపు,మున్నూరు కాపు కార్పొరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం కనీసం 20 వేల మందికి అయిన విద్యా,ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.కాపు, మున్నూరు కాపులు ఐఏఎస్, ఐపీఎస్,ఐఆర్ఎస్ ఇతర ప్రభుత్వం ఉన్నతి హోదాలో ఉన్న వారు ఏనాడు కూడా కాపు కులస్తుల ఉన్నతికి సహకరించటం లేదని కరుణాకర్ నాయుడు ఆవేదన వెలిబుచ్చారు. తోటి ఇతర కులస్తులు తమ కులాలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అన్ని ఆత్మ విమర్శ చేసుకోవాలని,కానీ కాపు,మున్నూరు కాపులు ప్రభుత్వ ఉన్నత పదవులో ఉన్న అధికారులు కాపులు అభివృద్ధికి చేయూత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.నామినేటెడ్ పోస్టుల్లోను కాపు, మున్నూరు కాపులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మా సామాజికవర్గానికి చెందిన మున్నూరు కాపుల ప్రాతినిధ్యం లేకుండా ఏ మంత్రివర్గం లేదని,మున్నూరు కాపులకు కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కరుణాకర్ నాయుడు కోరారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం
