వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి.- ఆర్డీవో పి.మధుసూదన్.
On
-ఘనంగా 14 వ ప్రపంచ వయోధికులపై వేధింపుల నివారణకు అవగాహన దినోత్సవం
జగిత్యాల జూన్ 15 (ప్రజా మంటలు):
వయో వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని,జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో చట్టం పకడ్బందీగా అమలవుతున్నదని జగిత్యాల డివిజన్ రెవెన్యూ అధికారి పులి మధుసూదన్ గౌడ్ అన్నారు.ఆదివారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యాలయంలో 14 వ ప్రపంచ వయోధికులపై వేధింపుల నివారణకు అవగాహన దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించారు.
ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం కు వెళ్లి కలెక్టర్ సత్యప్రసాద్ కు,ఎస్పీ ఆశోక్ కుమార్ కి ,మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ,మాజీ మంత్రి జీవన్ రెడ్డిలకు సీనియార్ సిటీజేన్స్ అసోసియేషన్ డిమాండ్లపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ అవగాహన సందర్భంగా 26 మంది విశిష్ట వయో వృద్ధులను,ఆరుగురు ఉత్తమ కూతుర్లను,ఆరుగురు ఉత్తమ కుమారులను, ఆరుగురు ఉత్తమ కోడళ్ల ను సన్మానించారు.
అనంతరం ఆర్డీవో పి.మధు సూదన్ మాట్లాడుతూ వయో వృద్ధులను వేధిస్తే చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటామన్నారు.తల్లిదండ్రులను నిరాదరణకు గురి చేస్తే 3 నెలలకు పైగా జైలు శిక్ష తో పాటు జరిమానా విధించే వీలుందన్నారు.సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు వయోధికుల చట్టం పై అవగాహన సదస్సులు,కౌన్సిలింగ్ లు నిర్వహిస్తుండడం ను అభినందించారు.
సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ చట్టం ఉన్నా వయోవృద్ధుల పై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు 2016 లో రాష్ర్టంలో రిటైర్డ్ ఉన్నత అధికారి పి.నర్సింహారావు ఆధ్వర్యంలో 33 జిల్లాల్లో ఏర్పాటు అయిన తమ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ వయోధికుల సమస్యల పరిష్కారం,సంక్షేమం కోసం ప్రభుత్వం గుర్తించిన, కృషి చేస్తున్న ఏకయిక సంస్థ అని పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల్లో డే కేర్ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో వయోధికుల కేసుల పరిష్కారంలో ఆర్డీవోలు మధుసూదన్,జీవాకర్ రెడ్డి, ఎన్. శ్రీనివాస్ లు రాష్ట్రంలో నెంబర్.వన్ గా నిలిచారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,జిల్లా కౌన్సెలింగ్ అధికారి పి.హన్మంత రెడ్డి,కోశాధికారి వెలముల ప్రకాష్ రావుఉపాధ్యక్షులు బొల్లం విజయ్, ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు పూసాల ఆశోక్ రావు,కోయ్యేడ సత్యనారాయణ, కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం, కార్యదర్శి గంటేది రాజ్ మోహన్,కోశాధికారి లక్ష్మినారాయణ,మెట్ పల్లి అధ్యక్షుడు వొజ్జల బుచ్చిరెడ్డి, కార్యదర్శి సౌడాల కమలాకర్, కోశాధికారి వెల్ముల ప్రభాకర్ రావు, జగిత్యాల డివిజన్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్,నక్క ఇంద్రయ్య, దేవేందర్ రావు,కొక్కు నారాయణ, ఎం.డి.ఇక్బాల్,సయ్యద్ యూసుఫ్,పుత్రయ్య,త్యాగరాజు, యాకూబ్ హుస్సేన్,ఉమ్మడి జిల్లా విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు దోనూరి భూమా చారి,వివిధ సంఘాల ప్రతినిధులు రాజ్ గోపాల్ చారి,సింగం గంగాధర్, నలువాల హన్మాండ్లు,రామ్ చంద్రం,సింగం భాస్కర్,పుప్పాల నర్సింగా రావు,అనుమల్ల సత్తయ్య, కస్తూరి శ్రీమంజరి,గంగం జలజ, సింగం పద్మ,దేవేంద్రమ్మ,బోబ్బాటి కరుణ,జిల్లా ,డివిజన్,మండలాల సీనియర్ సిటీజేన్స్,పెన్షనర్ల,వివిధ యువజన,మహిళా,ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గాయపడినవారిని ఉస్మానియాలో పరామర్శించిన MLA సంజయ్
Published On
By Special Reporter

నేను చాలా చేస్తాను, మరియు దేనికీ క్రెడిట్ పొందను - ఇరాన్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం 'జరుగుతుంది'- ట్రంప్
Published On
By Spl.Correspondent
.jpeg)
మహిళల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు టీడీఎఫ్ ఆర్థిక సాయం
Published On
By Special Reporter

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహాక సమావేశం
Published On
By Special Reporter

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన వారిని కలెక్టర్ పరామర్శ
Published On
By Siricilla Rajendar sharma

శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి కర కమలములచే మహాభాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ
Published On
By Siricilla Rajendar sharma

కవి ఇంటికి కళాశ్రీ భాగంగా రుద్రాంగి కమలకు కళాశ్రీ పురస్కారం
Published On
By Siricilla Rajendar sharma

దొడ్డి కొమరయ్య వారసత్వ స్ఫూర్తి తోసామాజిక తెలంగాణ నిర్మిద్దాం.- తుల ఉమ
Published On
By Special Reporter

స్నేహం చిరకాలం నిలిచే ఓ మధురానుభూతి
Published On
By Kasireddy Adireddy

సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు
Published On
By Spl.Correspondent

హెలికాప్టర్ ప్రమాదంలో 7గురి మృతి - తాత్కాలికంగా చర్దం యాత్ర సేవలు నిలిపివేత
Published On
By Special Reporter
.jpg)