పెండింగ్ పనులన్నీ  సత్వరమే  పూర్తి చేయండి..

సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

On
పెండింగ్ పనులన్నీ  సత్వరమే  పూర్తి చేయండి..

(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జూన్ 14:

ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు అన్నింటిని అధికారులు సత్వరమే పూర్తి చేయించాలని ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. అలాగే పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అటు రైతులకు ఇటు ప్రజలకు తాగు సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 

శనివారం ధర్మపురి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ లో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి పనులపై జగిత్యాల జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి లక్ష్మణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బీఎస్ లతా వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి సాగునీరు, తాగునీరు, విద్యా, వైద్యం పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, సివిల్ సప్లైస్, వ్యవసాయం, సంక్షేమ హాస్టళ్ల పనితీరు, విద్యుత్ తో పాటు వివిధ శాఖలకు సంబంధించి అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా మంత్రి సమీక్ష నిర్వహించారు. ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు.. కంప్లీట్ అయిన అభివృద్ధి పనులు.. రాబోయే రోజుల్లో చేపట్టే కార్యాచరణ ప్రణాళిక.. అభివృద్ధి.. వివిధ పనులు పెండింగ్లో ఉండడానికి గల కారణాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పలు కీలక సూచనలు చేశారు అధికారులకు. 

సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, తాను ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. పెండింగ్ పనులు అన్నీ సత్వరమే పూర్తి చేయాలని, 
ఎక్కడా ఇబ్బందులున్న తన దృష్టికి తీసుకురావాలని, పనులు పూర్తి చేయించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది 
అని స్పష్టం చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతతో సాగునీటిపారుదల అధికారులు పూర్తి చేయించాలని ఆదేశించారు. అదేవిధంగా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ధర్మపురి నియోజకవర్గంలో 95% వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తారని, అటు సాగునీరు ఇటు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

సమీక్షలో అధికారులు తెలిపిన సమస్యలు తొందరగా పరిష్కారం మార్గాలు అన్వేషించి పరిష్కరించుకోవాలని సూచించారు. మళ్లీ వచ్చే సమావేశం వరకు వాటి పెండింగ్లో పెట్టవద్దని మంత్రి పేర్కొన్నారు. రోళ్ళ వాగు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అటవీ శాఖ అనుమతులు వచ్చేలా అధికారులు కృషి చేయాలని, ఇందుకు తాను ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి అధికారులతో మాట్లాడతానని తెలిపారు.IMG-20250614-WA0007 

అదేవిధంగా ఇతర సాగునీటి ప్రాజెక్టుల  నిర్మాణ పనులకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఏ ఒక్క సమస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లకు బియ్యం పంపిణీ చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎప్పటికప్పుడు బియ్యం నాణ్యతను పరిశీలించాలని పేర్కొన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని, టాయిలెట్స్, మరుగుదొడ్లు లేని చోట త్వరగా నిర్మించాలని ఆదేశించారు. వానకాలం వ్యవసాయ సీజన్లో రైతులకు విత్తనాలు ఎరువులు యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని తెలిపారు. విద్యుత్ పరంగా కూడా గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

రాబోయే వర్షాకాలంలో గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా తాత్కాలికంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.. సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయాలని, అదేవిధంగా ప్రజలకు సైతం నాణ్యమైనవి అందించాలని అధికారులకు సూచనలు చేశారు. అభివృద్ధి పనులు..సమస్యల పరిష్కారంలో అధికారులు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి,
జిల్లా కలెక్టర్ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావాలని సలహా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల విషయంలో అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను స్పీడుగా కంప్లీట్ చేయాలని సూచించారు. అధికారులు పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని, అభివృద్ధి పనుల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.

ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి విషయంలో యాక్టివ్ గా ముందుకు సాగాలని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారులు సమస్యలను అధిగమించుకుంటూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకు ముందు మంత్రి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి ధర్మపురి లో పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కలను రాష్ట్ర ప్రభుత్వ నెరవేరుస్తున్నదని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు సత్వరమే పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు  నిర్మించుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తుందని తెలిపారు. ఈ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో ఆర్డిఓ మధుసూదన్, ఇరిగేషన్ సీఈ సుధాకర్ రెడ్డి,జిల్లా ఉన్నత స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

గల్లీకి అడ్డంగా రాళ్లు...  తీయండి సార్లు. 

గల్లీకి అడ్డంగా రాళ్లు...  తీయండి సార్లు.  సికింద్రాబాద్, జూలై 30 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ డివిజన్ లోని న్యూ బోలక్ పూర్ మెయిన్ రోడ్డు పైన పాత లారీ ధర్మకాంట సమీపములో ఇటీవల విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ నిమిత్తము రోడ్డును తవ్వారు. పని  ముగిసిన తర్వాత అక్కడి మట్టి రాళ్లను తీసి వేయకుండ.. అక్కడే...
Read More...
Local News 

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం    ధర్మపురి జూలై 30 ( ప్రజా మంటలు) పట్టణ మున్నూరు కాపు సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ని ఆహ్వానించిన మున్నూరు కాపు సంఘ సభ్యులు.అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ...
Read More...
Local News 

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు             జగిత్యాల జులై 30 ( ప్రజా మంటలు )                                   గురు వారం రోజున ఉదయం 10 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం మరియు శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో హుండీలు లెక్కింపజరిగింది రెండు హుండీలా ఆదాయం 59240/- రూపాయలు. ఇందులో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు, కార్యనిర్వాహణాధికారి, ప్రధాన అర్చకులు శ్రీ రంజిత్ కుమార్ ఆచార్యులు. అర్చకులు...
Read More...
Local News 

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి  బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బీర్పూర్ జూలై 29 (ప్రజా మంటలు) పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.       మంగళవారం  రోజున బీర్పూర్ మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల...
Read More...
Local News 

హెచ్ టి సర్వీసుల మంజూరుకు  సింగిల్  విండో వ్యవస్థ 

హెచ్ టి సర్వీసుల మంజూరుకు  సింగిల్  విండో వ్యవస్థ  జగిత్యాల జూలై 29(ప్రజా మంటలు) వినియోగదారుల హెచ్ టి. 11 KV , 33 KV ఆ పై వోల్టేజి  సర్వీసుల మంజూరు వేగవంతం చేయడానికి   సింగిల్  విండో వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని   జగిత్యాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం   స్పష్టం చేశారు .  హెచ్ టి. 11 KV , 33 KV,...
Read More...
Local News 

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ జగిత్యాల జులై 29 (ప్రజా మంటలు) ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల  జగిత్యాల 60 వసంతాల వేడుకలకు రాబోతున్న తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ  రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్    శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల ....
Read More...
Local News  Crime 

రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత 

రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత  (అంకం భూమయ్య)  గొల్లపల్లి జూలై 29 (ప్రజామంటలు): ధర్మపురి మండలం రాయపట్నం శివారు లో  ధర్మపురి ఎస్సై ఉదయ్ కుమార్ ,పోలీస్ సిబ్బంది తో వాహనాలు తనిఖీ చేస్తుండగా యువకుడు అనుమానస్పదంగా కనిపించగా, ఆ  వ్యక్తిని తనిఖీ చేయగా, అతని వద్ద నిషేధిత 130 గ్రాముల గంజాయి స్వాధీనం. చేసుకున్నారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు...
Read More...
Local News  Spiritual  

ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు సికింద్రాబాద్, జులై 29 (ప్రజామంటలు): మంగళవారం బన్సిలాల్ పేట్ డివిజన్ పరిధిలోని మెట్ల బావి దగ్గర ఉన్న అతి పురాతనమైన మహిమగల శ్రీ ఎర్ర పోచమ్మ ఆలయంలో ఆలయ మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నాగుల పంచమి ప్రత్యేక పూజలు ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో శివలింగానికి శ్రీ ఎర్ర పోచమ్మ అమ్మవారి విగ్రహాలకు...
Read More...
Local News  Crime 

మైనర్ బాలికపై   అత్యాచారం  కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

మైనర్ బాలికపై   అత్యాచారం  కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష   5000 రూపాయల జరిమానా - నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు - జిల్లా ఎస్పి అశోక్ కుమార్ (అంకం భూమయ్య) గొల్లపల్లి జూలై 29 (ప్రజా మంటలు): ధర్మపురి  సర్కిల్ పరిదిలోని చెందిన మైనర్ బాలికను నిందితుడు సంపంగి మహేష్  27సం, వ్యక్తి ప్రేమిస్తునాని పెళ్లి చేసుకుంటాను అని మాయ మాటలు...
Read More...
Local News 

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం 

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం    (అంకం భూమయ్య) గొల్లపల్లి జూలై 29 (ప్రజామంటలు):  గొల్లపల్లి మండలం లోని చిల్వకోడూరు గ్రామం లో గౌడ సొసైటీ 4,ఎకరాలభూమిలో 6000 ఈత,ఖర్జూర మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రామ్ రెడ్డి, ఎక్సైజ్ ఎస్సై జమీల్, ఏపీవో వేణు ,టిఏ రాజేందర్ ఎఫ్ఏ పాషా, గౌడ సొసైటీ అధ్యక్షుడు తాండ్ర చెన్నయ్య , ఎక్సైజ్...
Read More...
Local News 

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి విద్యార్థులకు ఆహార పదార్థాలు సమయానికి అందించాలి.- మారేడ్పల్లి గర్ల్స్ హైస్కూల్ ను సందర్శించిన కలెక్టర్ హరిచందన సికింద్రాబాద్, జూలై 29(ప్రజామంటలు) :   విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత ఉపాధ్యాయులను  ఆదేశించారు.మంగళవారం సికింద్రాబాద్ మారేడుపల్లి లోని  ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను  ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా
Read More...
Local News 

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ ఇబ్రహీంపట్నం జూలై 29 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలంలోని అమ్మక్కపేట, డబ్బా,వర్షకొండ, కోమటి కొండాపూర్, ఎర్దoడి, ములరాంపూర్,బర్తిపూర్, వేములకుర్తి, యమపూర్, తిమ్మాపూర్, గోధుర్,ఇబ్రహీంపట్నం గ్రామాలకు వెళ్లి 42,04,872/- నలపై రెండు లక్షల నాలుగు వేళ ఎనిమిది వందల డెబ్భై రెండు రూపాయలను, 42 కళ్యాణ లక్ష్మీ చెక్కులను గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులకు అందించిన...
Read More...