ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 1( ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా కుల గణన చేపట్టి,బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా,అసెంబ్లీ లో కుల గణన పై ఆమోదం తెలిపి దేశానికి దిక్సూచిగా మారీ కేంద్రం పై ఒత్తిడి తెచ్చి, కేంద్ర ప్రభుత్వం, క్యాబినెట్ కమిటీ దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టడానికి ఆమోదం తెలపడం పై జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారీ ఆదేశం మేరకు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రాహుల్ గాంధీ,సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి పొన్నం ప్రభాకర్,అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గార్ల చిత్ర పటానికి పాలాభిషేకం చేసి కృతఙ్ఞతలు తెలిపారు జగిత్యాల తాజా మాజీ చైర్ పర్సన్ ఆడవాల జ్యోతి లక్ష్మణ్ గారు
వారు మాట్లాడుతూ
దేశానికే రోల్ మోడల్ గా,ఆదర్శంగా తెలంగాణ
అభివృద్ధి సంక్షేమం లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది.
ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా కుల గణన చేస్తామని హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ,రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు
ఎస్సీ ABCD వర్గీకరణ ఆమోదం తెలపడంజరిగింది.
తెలంగాణ కుల గణన తోనే కేంద్రం దిగివచ్చింది.
బిసి,ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలకు ఎంతో మేలు కలుగుతుంది అని అన్నారు.
విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో అణగారిన వర్గాలకు ఒక నమ్మకం కుల గణన ప్రాధాన్యత కలిగి ఉంది.
రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా ఉండి జగిత్యాల అభివృద్ధికి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కృషి చేస్తున్నారన్నారు
బీద మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి అన్ని విధాలుగా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు అని అన్నారు నాయకులు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, జగిత్యాల పట్టణ అర్బన్ రూరల్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
