బన్సీలాల్‌పేట కురుమ స్మశాన వాటిక పరిరక్షణకు లీగల్ గా పోరాటం
కురుమ స్మశాన వాటికను కాపాడుతాం
-రాష్ర్ట కురుమ సంఘ ప్రెసిడెంట్ యెగ్గె మల్లేశం
సికింద్రాబాద్, అక్టోబర్ 11(ప్రజామంటలు):
బన్సీలాల్‌పేటలోని 1965 గజాల విస్తీర్ణంలో ఉన్న కురుమల స్మశానం వాటిక స్థలాన్ని భూబకాసులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని స్థానిక కురుమ సంఘం నాయకులు ఆరోపించారు. కోట్ల రూపాయల విలువైన ఈ స్థలం కురుమల హక్కుగా పూర్వం నుండి వాడుకలో ఉందని తెలిపారు.ఈ విషయాన్ని రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం దృష్టికి తీసుకెళ్లగా, ఆయన శనివారం స్మశానం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ కురుమల హక్కులను కాపాడటానికి కోర్టును ఆశ్రయిస్తాం. ఎంతటి ఖర్చుకైనా వెనుకాడం, స్మశానం వాటికను తప్పక రక్షిస్తాం అని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి కూడా తీసుకెళతామని యెగ్గె మల్లేశం తెలిపారు.
ప్రస్థుతం 350 గజాల స్థలంలో నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని ప్రభుత్వం నిలిపివేసి, దానిని తొలగించాలని, దీనిపై హైడ్రాను ఆశ్రయిస్తామన్నారు. దశాబ్దాల తరబడిగా సదరు 1965 గజాల స్థలంలో స్మశాన వాటిక ఉన్నట్లు రెవిన్యూ రికార్డుల్లో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, రాష్ట్ర బీసీ మోర్చా ఉపాధ్యక్షుడు చీర సత్యనారాయణ , కొలుపుల నర్సింహా, కట్ట మల్లేశం, మంత్రి కళావతి, శివప్రసాద్,చిగుమళ్ల రాఘవేందర్, గోడ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వేద పరిరక్షణలో ప్రభుత్వ సహకారం ఉంటుంది – మంత్రి శ్రీధర్ బాబు

అమెరికాలోని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) వివాదం — పాలక మండలి, ప్రభుత్వ అనుబంధాలపై ప్రశ్నలు
1.jpeg)
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి - జి. చిన్నారెడ్డి

ధర్మపురి సార్థక నామం_ ధర్మము తెలియడం కాదు ఆచరించడమే ధర్మము ప్రవచనకారుడు చాగంటి

టీ-స్క్వేర్ నగరంలోనే ఒక ఐకానిక్ భవనం- సీఎం రేవంత్ రెడ్డి లా ఉండాలని

వృద్దుల్లో మనోనిబ్బరం నింపేందుకు అవగాహన సదస్సు

బన్సీలాల్‌పేట కురుమ స్మశాన వాటిక పరిరక్షణకు లీగల్ గా పోరాటం

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం... బీద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి....ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీల జట్టుకు ఎంపికైన చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గమ్య

డిజిటల్ యుగంలో బాలికలపై శోషణ పెరిగింది - సీజేఐ బి ఆర్ గవాయి

సేంద్రీయ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలి - మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఆఫ్ఘన్ మంత్రి పాత్రికేయుల సమావేశంతో మాకు సంబంధంలేదు - భారత విదేశాంగ శాఖ
