ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల సెప్టెంబర్ 16(ప్రజా మంటలు)
ఉత్తమ విద్యార్థులుగా ఎదిగి జిల్లా నర్సింగ్ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి.
జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలపై IMA హాల్ లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్ వంటి అనైతిక చర్యలకు పాల్పడకూడదని, అలా జరిగితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో చదువుకోవాలని, ఒకరికి ఒకరు సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. సీనియర్లు జూనియర్లకు ప్రోత్సాహం, మార్గనిర్దేశం చేయాలని కానీ భయపెట్టరాదని సూచించారు.ర్యాగింగ్ చేయడం ఒక పెద్ద నేరమని, అది బాధిత విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ర్యాగింగ్ చేయడం వల్ల ఎంతోమంది విద్యార్థులు తమ చదువు, భవిష్యత్తు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు.
అలాంటి పరిస్థితులు జగిత్యాల జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని స్పష్టం చేశారు.ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం ర్యాగింగ్‌లో పాల్గొన్న విద్యార్థులపై క్రిమినల్ కేసులు, జైలు శిక్ష, కాలేజీ నుండి బహిష్కరణ, స్కాలర్షిప్ రద్దు, ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం వంటి తీవ్ర శిక్షలు తప్పవని విద్యార్థులకు వివరించారు.
కళాశాల ప్రాంగణం సురక్షితంగా ఉండేందుకు ప్రతి విద్యార్థి సహకరించాలని, ర్యాగింగ్ అనే దుష్ప్రవర్తనకు చెక్ పెట్టి స్నేహపూర్వక వాతావరణంలో చదువు కొనసాగించాలని సూచించారు. ఎవరైనా ర్యాగింగ్ బాధితులుగా మారితే ఎలాంటి భయం లేకుండా వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ లు ఏర్పాటు చేయాలని అధ్యాపకుల కు సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పి విద్యార్థులను ప్రశ్నలు అడిగి ర్యాగింగ్ వల్ల కలిగే పరిణామాలపై అవగాహనను పరీక్షించారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్ ,టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, నర్సింగ్ కళాశాల సూపరింటెండెంట్ రాజ్ గోపాల్,మరియు అధ్యాపకులు మరియు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్
