ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చైల్డ్ హెల్ప్ లైన్ అవగాహన సదస్సు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 07 (ప్రజా మంటలు): కేంద్ర
గొల్లపల్లి మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో చైల్డ్ హెల్ప్ లైన్ పై అవగాహన క సదస్సు నిర్వహించారు ఇందులో భాగంగా చైల్డ్ హెల్ప్ లైన్ అధికారి సామల రాజేశం మాట్లాడుతూ, చైల్డ్ హెల్ప్ లైన్ అనేది ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 1098, సున్నా నుండి 18 సంవత్సరాలలోపు బాల బాలికల సమస్యలపై పనిచేస్తుందని తెలిపారు.
అలాగే బాల్య వివాహ నిరోధక చట్టం 2006, ఫోక్సొ చట్టం 2012 బాల కార్మికుల నిషేధ చట్టం 1986 చట్టాలపై అవగాహన చైల్డ్ హెల్ప్లైన్ 1098 టోల్ ఫ్రీ నెంబర్ జాతీయస్థాయిలో 24 గంటలు అందుబాటులో ఉండి పిల్లల రక్షణ మరియు సంరక్షణ కొరకు పని చేయడం జరుగుతుందని అన్నారు.
అలాగే అమ్మాయిలకు 18 సంవత్సరాలు పైబడిన తర్వాత అబ్బాయిలకు 21 సంవత్సరం నిండిన తర్వాత పెళ్లి చేయాలని సూచించారు ఒకవేళ తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలకి పెళ్లి చేసినట్లయితే శారీరక సమస్యలు మానసిక సమస్యలు వస్తాయని బాల్య వివాహాలు చేయరాదని సూచించారు.
పిల్లలను చట్ట ప్రకారం దత్తాత్త తీసుకోవాలని తెలిపారు బాల్య వివాహ నిర్ములనకు సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు ఈకార్యక్రమంలో డాక్టర్ వై, శ్రీకాంత్, సూపర్వైజర్లు నరేందర్,శారద, సత్యనారాయణ, స్టాప్ నర్స్ జ్యోతి రాణి,పోచమ్మ, ఎన్, లత,ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్
